పదవ తరగతి అర్హతతో ఎంటిఎస్ ఉద్యోగాలు! CSIR - NIIST Recruitment 2026

 CSIR - NIIST Recruitment 2026


CSIR - NIIST Recruitment 2026



  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పని చస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లనేరి సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం పదవ తరగతి అర్హత ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ CSIR - NIIST Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ నోటిఫికేషన్ కోసం మే 16, 2026వ తేదీ ఉదయం 9 గంటల నుండి జూన్ 15, 2026వ తేదీ సాయంత్రం 5:30 లోపు అప్లై చేసుకోవాలి.


బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 పోస్టులు 


రైల్వేలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.


Age Limit:

  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

  పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 

Selection Process:

  సింగిల్ ఎగ్జామ్ ను నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి స్టాండర్డ్ లో ఈ పరీక్ష ఉంటుంది. 

జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 
క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 
జనరల్ అవేర్నెస్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు 
ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు 

150 ప్రశ్నలకు గాను 450 మార్కులు చొప్పున ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంది. పరీక్షా పేపర్ అనేది ఇంగ్లీషు, హిందీ మరియు మలయాళం భాషల్లో ఉంటుంది. రెండు గంటల పాటు ఈ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

How To Apply:

  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://www.niist.res.in/ లో మే 16, 2026వ తేదీ నుండి జూన్ 15, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. 

Application Fee:

  ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజ్ కింద చెల్లించాలి. 

 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Vacancy Details:

  ఈ నోటిఫికేషన్ ద్వారా 2 (1- UR, 1- OBC) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Salary:

ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 1 ప్రకారం 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొనీ నెలకు 33,840 రూపాయల వరకు జీతం వస్తుంది. 


Official website: https://www.niist.res.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు