MTS Jobs In Telugu 2026

 సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు

MTS Jobs In Telugu 2026


  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తున్నటువంటి సాహిత్య అకాడమీ(నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్), ఢిల్లీ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ క్లర్క్, వాన్ డ్రైవర్, మెసెంజర్ కం రైడర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ప్రూఫ్ రీడర్ కం జనరల్ అసిస్టెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రాం అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎడిటర్, డిప్యూటీ సెక్రటరీ (జనరల్ అడ్మిన్) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో ఆగస్టు 22, 2026వ తేదీ నుండి సెప్టెంబర్ 21, 2026వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి.

Age Limit:

  50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

  పోస్టును బట్టి పదవ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లమా, మాస్టర్స్ డిగ్రీ అర్హతలతో పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు మరియు పోస్టుల వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply:


  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీయించుకోవాలి. అప్లికేషన్ ఫారం నింపాలి. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఎటువంటి తప్పులు లేకుండా నింపండి. ఫారం ని నింపిన తర్వాత వారు అడిగిన అడ్రస్ కు పోస్టు ద్వారా సెప్టెంబర్ 21, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పంపాలి.

Application Fee:

  లెవెల్ 1 నుండి లెవెల్ 6 పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. 
  ఈ డబ్ల్యూ ఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

లెవెల్ 10/11 పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. 
  ఈ డబ్ల్యూ ఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు