IBPS PO Recruitment 2025 in telugu: ఐబీపీఎస్ పిఓ 5208 ఉద్యోగాలు.
IBPS (Institute of Banking Personal Selection) నుండి వివిధ బ్యాంకుల్లో పని చేయడానికి PO(Probationary Officer) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IBPS PO Recruitment 2025 ద్వారా 5208 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ IBPS PO Notification ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సిండ్ బ్యాంక్, యుసిఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు ₹48,480 నుండి ₹85,920 మధ్య సాలరీ ఉంటుంది. సిటిజెన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ IBPS PO Recruitment 2025 కోసం అభ్యర్థులు జులై 01, 2025 వ తేదీ నుండి జూలై 21, 2025 వ తేది లోపు అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి www.ibps.in లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 21, 2025.
ఈ IBPS PO Recruitment 2025 కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్టు 2025 లో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ ను అక్టోబర్ 2025 లో నిర్వహించడం జరుగుతుంది.
0 కామెంట్‌లు