Ad Code

Responsive Advertisement

SSC MTS Recruitment 2025 in telugu: ఎస్ఎస్సి ఎంటిఎస్ ఉద్యోగాల భర్తీ.

 SSC MTS Recruitment 2025 in telugu: ఎస్ఎస్సి ఎంటిఎస్ ఉద్యోగాల భర్తీ.

SSC MTS Recruitment 2025 in telugu: ఎస్ఎస్సి ఎంటిఎస్ ఉద్యోగాల భర్తీ.



SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి ఎంటీఎస్ మరియు హవల్దర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SSC MTS/Havaldar Recruitment 2025 ద్వారా Havaldar 1089 పోస్టులను, MTS (Multi Tasking Staff) - 4375 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సిటిజెన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఈ SSC MTS Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 26, 2025 వ తేదీ నుండి జులై 24, 2025వ తేదీ లోపు https://ssc.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 25, 2025. 

  జులై 29, 2025వ తేదీ నుండి జూలై 31, 2025వ తేదీ వరకు అప్లికేషన్ లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే సరిదిద్దుకోవాలి. ఈ SSC MTS Recruitment 2025 కి సంబంధించి ఎగ్జామ్ అనేది 20 సెప్టెంబర్ 2025వ తేదీ నుండి 24 అక్టోబర్ 2025 తేది వరకు నిర్వహించడం జరుగుతుంది.

Age Limit For SSC MTS Recruitment 2025 in telugu:


  ఈ SSC MTS Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఆగస్టు 01, 2025 వ తేది నాటికి 

  ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. అంటే అభ్యర్థులు ఆగస్టు 02, 2000 వ తేదీ నుండి ఆగస్టు 01,2007 వ తేదీ మధ్య పుట్టిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

  హవాల్దార్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. అంటే అభ్యర్థులు ఆగస్టు 02, 1998 వ తేదీ నుండి ఆగస్టు 01, 2007 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.





  ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అండ్ రిజర్వ్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సషన్ ఉంది.  

Educational Qualification For SSC MTS Recruitment 2025 in telugu:


  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి పదవ తరగతి కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ SSC MTS Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Application Fee For SSC MTS Recruitment 2025 in telugu:


  ఈ SSC MTS Recruitment 2025 in telugu ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో కట్టాలి. జూలై 25, 2025 వ తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

Selection Process For SSC MTS Recruitment 2025 in telugu:


  సింగిల్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Computer Based Exam:


సెషన్-1: 

న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ - 20 ప్రశ్నలకు గాను 60 మార్కులు. 
రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ - 20 ప్రశ్నలకు గాను 60 మార్కులు.

సెషన్-2:

జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలకు గాను 75 మార్కులు 
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలకు గాను 75 మార్కులు.

  సెషన్-1 ను 45 నిమిషాలు, సెషన్-2 ను 45 నిమిషాలు మొత్తంగా 90 నిమిషాల పాటు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మొదటి 45 నీమిషాలు అవ్వగానే సెషన్-1 క్లోజ్ అయి సెషన్-2 ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

  ఎగ్జాం అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఉంటుంది.

  సెషన్-1 లో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు. సెషన్-2 లో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ ఉంది. సిలబస్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి.

  ఈ SSC MTS Recruitment 2025 కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 20 సెప్టెంబర్ 2025 వ తేదీ నుండి 24 అక్టోబర్ 2025 వ తేదీ వరకు షిఫ్టులు వైస్ గా నిర్వహించడం జరుగుతుంది.

  ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకుంటారో వారికి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ తో పాటు వాకింగ్ (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్) ను కూడా నిర్వహించడం జరుగుతుంది.

వాకింగ్: 


పురుషులకి - 1600 మీటర్లను 15 నిమిషాలలో వాకింగ్ చేయాలి. 
మహిళలకి- ఒక కిలోమీటర్ ను 20 నిమిషాలలో వాకింగ్ చేయాలి. 

అలాగే..

పురుషులు:
హైట్: 157.5 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు 5 సెంటీమీటర్ల రిలాక్సియేషన్ ఉంటుంది.

చెస్ట్: 81 సెంటిమీటర్స్ ని కలిగి ఉండాలి. (అలాగే ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ ఉండాలి. 

మహిళలు: 152 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. ఎస్టి అభ్యర్థులకు 2.5 సెంటీమీటర్ల రిలాక్సియేషన్ ఉంది.

వెయిట్: 48 కేజీల వెయిట్ ను కలిగి ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు 2 కేజీల రిలాక్సియేషన్ ఉంటుంది.

Examination Centers For SSC MTS Recruitment 2025 in telugu:


  ఆంధ్రప్రదేశ్ లో: కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోల్, శ్రీకాకుళం, ఏలూరు.

  తమిళనాడు లో: క్రిష్ణగిరి, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్.

Official Website: https://ssc.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు