Ad Code

Responsive Advertisement

BHEL ARTISAN RECRUITMENT 2025 In Telugu: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.

 BHEL ARTISAN RECRUITMENT 2025 In Telugu: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.


BHEL ARTISAN RECRUITMENT 2025 In Telugu: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.




BHEL(Bharat Heavy Electricals Limited) నుండి ఐటిఐ అర్హతతో అప్లై చేసుకునే విధంగా Artisans Grade IV ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BHEL ARTISAN RECRUITMENT 2025 ద్వారా 515 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

  ఈ 515 ఉద్యోగాలలో ఫిట్టర్ - 176 ఉద్యోగాలు, వెల్డర్ - 97 ఉద్యోగాలు, టర్నర్ - 51 ఉద్యోగాలు, మీచినిస్ట్ - 104 ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ - 65 ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 18 ఉద్యోగాలు, ఫౌండ్రి మాన్ - 4 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలుగు రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.


  ఈ BHEL ARTISAN RECRUITMENT 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు జూలై 16, 2025వ తేదీ నుండి ఆగస్టు 12, 2025వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 2వ వారంలో నిర్వహించడం జరుగుతుంది.

Age Limit: 


  జులై 01, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సియేషన్ వర్తిస్తుంది.



Educational Qualification: 


  అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి. లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.

 అలాగే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.

అయితే అభ్యర్థులు 60 శాతం మార్కులను ఐటిఐ లో మరియు అప్రెంటిషిప్లో తెచ్చుకొని ఉండాలి. (ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులు తెచ్చుకొని ఉంటే సరిపోతుంది.)

Selection Process: 


  రెండు స్టేజిల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

1) కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్


  ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2025 సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది.


2) స్కెల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ 


Application Fee: 


  ఈ BHEL ARTISAN RECRUITMENT 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1072 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండికాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 472 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: https://careers.bhel.in.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు