Ad Code

Responsive Advertisement

ISRO Notification 2025 in telugu: ఇస్రో నోటిఫికేషన్ 2025

 ISRO Notification 2025 in telugu: ఇస్రో నోటిఫికేషన్ 2025 





  ISRO (Indian Space Research Organisation) నుండి Notification విడుదల అయింది. ఈ ISRO Notification 2025 ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ - ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 78,000 రూపాయల జీతం రావడం జరుగుతుంది.


  ఈ ISRO Notification 2025 ద్వారా 

టెక్నికల్ అసిస్టెంట్: ఎలక్ట్రానిక్స్ - 27(అన్ రిజర్వ్డ్ 14, ఓబిసి-9, ఎస్సీ-1, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్-2) పోస్టులను, మెకానికల్ - 27(అన్ రిజర్వ్డ్ 16, ఓబిసి-6, ఎస్సీ-2, ఈడబ్ల్యూఎస్-3) పోస్టులను, కంప్యూటర్ సైన్స్ - 12 పోస్టులను, కెమికల్ - 6 పోస్టులను, ఆటోమొబైల్ - 1 పోస్టును, సివిల్ - 2 పోస్టులను, రిఫ్రిజిరేషన్ & ఏసి-1 పోస్టును భర్తీ చేస్తున్నారు.


 సైంటిఫిక్ అసిస్టెంట్: ఫిజిక్స్-4 పోస్టులను, కెమిస్ట్రీ -1 పోస్టును భర్తీ చేస్తున్నారు.


లైబ్రరీ అసిస్టెంట్ - ఏ: 2 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఏ సెంటర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరే ఆఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అన్న తెలుగువారి కోసం సికింద్రాబాద్లో కూడా పోస్టులు ఉన్నాయి.


  ఈ ISRO Notification 2025 కోసం అభ్యర్థులు జూన్ 04, 2025వ తేదీ నుండి జూన్ 18, 2025 వ తేదీ లోపు http://www.vssc.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి.


Age Limit: 


  18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ISRO Notification 2025 ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification:


టెక్నికల్ అసిస్టెంట్:

ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

మెకానికల్: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిప్లమా లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ సైన్స్: కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి.

కెమికల్: కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. 

ఆటోమొబైల్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి.

సివిల్: సివిల్ ఇంజనీరింగ్ డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.

రిఫ్రిజిరేషన్ & ఏసి: రిఫ్రిజిరేషన్ & ఏసి డిప్లమాలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి.


సైంటిఫిక్ అసిస్టెంట్: 


ఫిజిక్స్: ఫిజిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


కెమిస్ట్రీ: కెమిస్ట్రీ లో బ్యాచిలర్స్ డిగ్రీ ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


లైబ్రరీ అసిస్టెంట్ - ఏ: 

1) గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 
2) లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Selection Process: 


రిటన్ టెస్ట్ ను మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Written Test: 80 ప్రశ్నలకు గాను ఈ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సరైన ప్రశ్నకు ఒక మార్కు రావడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

Examination Centers: 

AP: విశాఖపట్నం, Telangana: హైదరాబాదు.

Skill Test: రిటన్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ కు 1:5 రేషియో లో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే.

Application Fee: 


  ఈ ISRO Recruitment 2025 కు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద అప్లై చేయాలి.

  మహిళలు/ఎస్సీ/ఎస్టి/ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత 750 రూపాయలు రీఫండ్ కావడం జరుగుతుంది.

మిగిలిన వారికి 500 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.

Official Website: http://www.vssc.gov.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు