Indian army 142nd TGC Recruitment 2025 in telugu: లెఫ్టినెంట్ స్థాయి ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ నుండి 142nd టెక్నికల్ గ్రేడ్ కోర్సు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కోసం అన్ మ్యారీడ్ మేల్ కాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) డెహ్రాడూన్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల అయింది.
ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ అయి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Lieutenant స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ ను బట్టి కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కలనల్, కలనలకు ప్రమోషన్ రావడం జరుగుతుంది.
ఈ Lieutenant స్థాయి ఉద్యోగానికి సెలెక్ట్ అయితే.. ఈ ఉద్యోగం లెవెల్ 10 ఉద్యోగం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే 56,100 - 1,77,500 - ఆధార్ అలవెన్సెస్ రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.
ఈ ఆర్మీ నోటిఫికేషన్ ద్వారా సివిల్ - 08, కంప్యూటర్ సైన్స్ - 06, ఎలక్ట్రికల్ - 02, ఎలక్ట్రానిక్స్ - 06, మెకానికల్ - 06, Misc ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ - 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 30 నుండి మే 29 లోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
01 జనవరి 2025 వ తేదీ నాటికి 20 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
(అంటే అభ్యర్థులు 02 జనవరి 1999 వ తేదీ నుండి 01 జనవరి 2006 వ తేదీ మధ్యలో పుట్టి ఉండాలి.)
మీ యొక్క డేట్ అఫ్ బర్త్ ను ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది.
Educational Qualification:
ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. 01 జనవరి 2026వ తేదీ నాటికి అభ్యర్థుల యొక్క మార్కు లిస్టులు పాస్ అయినట్లు వచ్చి ఉండాలి.
ఫైనల్ ఇయర్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అఫిషియల్ వెబ్సైట్లో ఒకసారి చూసుకోండి.
minimum physical standards:
*2.4 కిలోమీటర్ల రన్నింగ్ ను 10 నిమిషాల 30 సెకండ్లలో కంప్లీట్ చేసే సత్తా ఉండాలి.
*40 పుషప్స్ చేయగలిగే సత్తా ఉండాలి.
*06 పుల్లప్స్
*30 సెటప్
*టు సెట్ ఆఫ్ 30 రిపిటేషన్స్ స్కాట్స్
* టు సెట్ ఆఫ్ 30 రిపిటేషన్స్ Lunges
* ఫండమెంటల్ ఆఫ్ స్విమ్మింగ్ వచ్చి ఉండాలి.
Selection Procedure:
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ముందుగా అప్లికేషన్స్ ను షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది.
షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ కి సంబంధించి ఎగ్జామ్స్ సెంటర్స్ ను అలాట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ సెంటర్ అలాట్ కి సంబంధించి మీ మెయిల్ కి రావడం జరుగుతుంది.
ఎగ్జామ్స్ సెంటర్స్ ను ప్రయాగ్ రాజ్(ఉత్తర ప్రదేశ్), భూపాల్(మధ్యప్రదేశ్), బెంగళూరు(కర్ణాటక) మరియు జలంధర్(పంజాబ్) 04 సెంటర్లను కేటాయించడం జరిగింది.
ఈ ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ SSB ఇంటర్వ్యూ అనేది 2 స్టేజీలలో ఉంటుంది. స్టేజ్ 1 మరియు స్టేజ్ 2. ఎవరైతే స్టేజ్ వన్ క్వాలిఫై అవుతారో వారిని మాత్రమే స్టేజ్ 2 కు ఎంపిక చేయడం చరుగుతుంది. మొత్తంగా ప్రాసెస్ అనేది 5 రోజులు ఉంటుంది.
తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే మెడికల్ గా ఫీట్ ఉంటారో వారికి ఈ జాబ్ రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు Lieutenant ర్యాంకు జాబ్ రావడం జరుగుతుంది. జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే Indian Military Academy, డెహ్రాడూన్ లో 12 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో శాలరీ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ను సమకూర్చడం జరుగుతుంది.
Official Website: www.joinindianarmy.nic.in
0 కామెంట్‌లు