Ad Code

Responsive Advertisement

AP ECET Hall Ticket Download 2025 in telugu: ఏపీ ఈసెట్ హాల్ టికెట్స్

 AP ECET Hall Ticket Download 2025 in telugu: ఏపీ ఈసెట్ హాల్ టికెట్స్



  AP ECET రాష్ట్ర పరీక్షలు నిర్వర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ అనంతపూర్ కి ఇచ్చింది. జేఎన్టీయూ అనంతపూర్ ఈ AP ECET ఎగ్జామ్ ను 10వసారి నిర్వహించనుంది. గత తొమ్మిది సార్లు సక్సెస్ఫుల్గా ఈ AP ECET పరీక్షను నిర్వహించిన ఘనత జేఎన్టీయూ అనంతపూర్ కి ఉంది. ఈసారి కూడా ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామ్ ను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఈ పరీక్షను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అని జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు తెలిపారు.


  నిష్ణాతులైన విద్యావేత్తలతో పరీక్షా పత్రాలను తయారు చేయించడం, వాటిని సాఫ్ట్ కాపీసుగా రూపొందించడం ఎడిటింగ్ మోడ్రేషన్ అన్ని ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయి పరీక్ష సమయానికి పరీక్ష నిర్వహించడానికి అన్ని విధాలుగా మా కన్వీనర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు తెలిపారు.


  ఈ AP ECET Exam 2025 ద్వారా డిప్లమా కంప్లీట్ చేసిన విద్యార్థులు డైరెక్ట్ గా లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో చేరే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ అవకాశం లభిస్తుంది. 


ఈ 2025 సంవత్సరానికి గాను AP ECET ను 14 బ్రాంచీల్లో మే 06, 2025 వ తేదీ ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ AP ECET 2025 Exam ను రెండు స్టేషన్లలో నిర్వహించడం జరుగుతుంది. మే 06, 2025వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ AP ECET 2025 Exam ను 14 కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.


UPSC Civil Services 2024 Toppers మాటలు


అగ్రికల్చర్ ఇన్ ఇంజనీరింగ్ లో 156 అప్లికేషన్

బయోటెక్నాలజీ లో 1 అప్లికేషన్,

బిఎస్సి మ్యాథమెటిక్స్ కు 45 అప్లికేషన్స్, 

సెరామిక టెక్నాలజీకి 03 అప్లికేషన్స్,

కెమికల్ ఇంజనీరింగ్ కు 308 అప్లికేషన్స్,

సివిల్ ఇంజనీరింగ్ కు 3050 అప్లికేషన్స్, 

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కు అత్యధికంగా 11029 అప్లికేషన్స్, 

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కు 5868 అప్లికేషన్స్, 

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 9416 అప్లికేషన్స్, 

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో 54 అప్లికేషన్స్, 

మెకానికల్ ఇంజనీరింగ్ లో 4757 అప్లికేషన్స్, 

మెటలార్జికల్ ఇంజనీరింగ్ కు 102 అప్లికేషన్స్, 

మైనింగ్ ఇంజనీరింగ్ కు 71 అప్లికేషన్స్, 

ఫార్మసీలో 3327 అప్లికేషన్స్, 

  మొత్తంగా ఈ సంవత్సరం AP ECET 2025 Exam ను 35,187 విద్యార్థులు రాయనున్నారు.


  విద్యార్థుల యొక్క ఆప్షన్స్ మేరకు వాళ్ళ ఎగ్జాం సెంటర్ రావడం జరుగుతుంది. ఈ AP ECET 2025 Exam కోసం 110 ఎగ్జామ్స్ సెంటర్లను నిర్వహించడం జరిగింది. ఈ 110 ఎగ్జామ్ సెంటర్లలో 109 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మిగిలిన ఒక సెంటర్ ను హైదరాబాదులో పెట్టడం జరిగింది.


AP ECET 2025 Exam Imp Instructions: 


  ఈ AP ECET 2025 Exam కోసం మార్నింగ్ సెషన్ 7:30 కి విద్యార్థులను అలోవ్ చేయడం జరుగుతుంది. 

ఆఫ్టర్నూన్ సెషన్ 12:30 కి అలవ్ చేయడం జరుగుతుంది.

  విద్యార్థులకు ఎగ్జామ్ కి 1:30 నిమిషాల ముందే ఎగ్జామ్ హాల్లోకి అలోవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ వీలైనంత తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకోవాలి. 

ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించడం జరగదు. 

AP ECET 2025 EXAM Hall Tickets Download:


ఈ AP ECET 2025 EXAM యొక్క Hall Tickets మే 01, 2025వ తేదీ న విడుదల అయ్యాయి. ఈ AP ECET 2025 EXAM Hall Tickets Download చేసుకోండి - Click Here

  విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా చదువుకోవాలి. 

  విద్యార్థులకు ఎగ్జామ్ హాలు లోకి క్యాలిక్యులేటర్స్, హ్యాండ్ బుక్స్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఎటువంటి ఎలక్ట్రిక్ జ్ఞడ్జెస్ అనుమతించడం జరగదు.

  రఫ్ సీట్స్ ఎగ్జామ్ హాల్ లో అందజేయడం జరుగుతుంది. ఎటువంటి రఫ్ షీట్స్ విద్యార్థులు లోపలికి తీసుకొని వెళ్ళవద్దు. 

విద్యార్థులు పరీక్ష హాలుకు తీసుకు వెళ్ళవలసినవి.

* డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్
* డౌన్లోడ్ చేసుకున్న వారి అప్లికేషన్ ఫామ్ 
* బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్.
* ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు