Ad Code

Responsive Advertisement

Bank of Baroda PEON Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు.

 Bank of Baroda PEON Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు.

Bank of Baroda PEON Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు.


  Bank of Baroda నుండి PEON Recruitment 2025 విడుదల అయింది. ఈ Bank of Baroda Recruitment 2025 ద్వారా OFFICE ASSISTANT (PEON) ఉద్యోగాలను రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. టోటల్గా 500 OFFICE ASSISTANT (PEON) ఉద్యోగాలను Bank of Baroda Recruitment ద్వారా భర్తీ చేస్తున్నారు.


 ఈ Bank of Baroda PEON Recruitment 2025 ద్వారా

  ఆంధ్రప్రదేశ్లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు, అస్సాంలో 4 పోస్టులు, బీహార్ లో 23 పోస్టులు, చండీగర్ లో 1 పోస్టు,చతిస్గర్ లో 12 పోస్టులు, డెహ్రా మరియు నాగర్ హవేలీ లో 1 పోస్టు, దామన్ మరియు డయూలో 1 పోస్టూ, ఢిల్లీలో 10 పోస్టులు, గోవాలో 3 పోస్టులు, గుజరాత్ లో 80 పోస్టులు, హర్యానాలో 11 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్ లో 3 పోస్టులు, జమ్ము మరియు కాశ్మీర్ లో 1 పోస్టు, జార్ఖండ్ లో 10 పోస్టులు, కర్ణాటకలో 31 పోస్టులు, కేరళలో 19 పోస్టులు, మధ్యప్రదేశ్ లో 16 పోస్టులు, మహారాష్ట్రలో 29 పోస్టులు, మణిపూర్ లో 1 పోస్టు, నాగాలాండ్ లో 1 పోస్టు, ఒడిస్సాలో 17 పోస్టులు, పంజాబ్లో 14 పోస్టులు, రాజస్థాన్లో 46 పోస్టులు, తమిళనాడులో 24 పోస్టులు, ఉత్తరప్రదేశ్లో 83 పోస్టులు, ఉత్తరాఖండ్లో 10 పోస్టులు, వెస్ట్ బెంగాల్లో 14 పోస్టులు మొత్తంగా 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేటగిరీకి సంబంధించి పోస్టులను మీరే చూసుకోండి అఫీషియల్ నోటిఫికేషన్ లో.


Bank of Baroda PEON Recruitment 2025 కోసం అభ్యర్థులు మే 3, 2025వ తేదీ నుండి మే 23, 2025 వ తేదీ లోపు www.bankofbaroda.co.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 


AP Home Guard Recruitment 2025


Age Limit: 


  మే 01, 2025 వ తేదీ నాటికి 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ Bank of Baroda PEON Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

(అంటే అభ్యర్థులు మే 01, 1999 నుండి మే 01, 2007 మధ్య పుట్టి ఉండాలి)


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సియేషన్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


Educational Qualification: 


  పదవ తరగతి పాస్ అయి ఉండాలి. 

   మీరు ఏ స్టేట్ కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి అప్లై చేయాలి అంటే తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉండాలి.


Selection Process: 


ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్టు ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Online Test: 

  నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు - 20 నిమిషాలు 

జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు - 20 నిమిషాలు 

ఎలిమెంటరీ అర్థమెటిక్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు - 20 నిమిషాలు 

సైకో మెట్రిక్ టెస్ట్ (రీజనింగ్) - 25 ప్రశ్నలు - 25 మార్కులు - 20 నిమిషాలు 

టోటల్గా ఈ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 80 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది.
ఎగ్జాం అనేది తెలుగులో కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాదానానికి  0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 06 నెలల సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

Examination Centers: 


  ఏపీలో: గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, 

తెలంగాణ లో : హైదరాబాద్

Application Fee: 


  ఈ Bank of Baroda PEON Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 600 రూపాయలు + టాక్సెస్ + పేమెంట్ గేట్వే చార్జెస్ ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 100 రూపాయలు + టాక్సెస్ + పేమెంట్ గేట్వే చార్జెస్ ను అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Official Website:  www.bankofbaroda.co.in





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు