Ad Code

Responsive Advertisement

IDBI Bank JAM Recruitment 2025 in telugu: ఐడిబిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలు

 IDBI Bank JAM Recruitment 2025 in telugu: ఐడిబిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలు 

IDBI Bank JAM Recruitment 2025 in telugu: ఐడిబిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలు


  IDBI Bank నుండి Junior Assistant Manager (JAM), Grade ‘O’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IDBI Bank JAM Recruitment 2025 ద్వారా 676 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


ఈ 676 పోస్టుల లో అన్ రిజర్వ్డ్ - 271 పోస్టులు, ఎస్సీ - 140 పోస్టులను, ఎస్టి - 74 పోస్టులను, ఓబీసీ - 124 పోస్టులను, ఈడబ్ల్యూఎస్ - 67 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు కూడా పోస్టులను కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మే 7, 2025వ తేదీ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి ఇండియన్ మెయిల్ మరియు ఫిమేల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.


  ఈ IDBI Bank JAM Recruitment 2025 in telugu కోసం అభ్యర్థులు మే 8, 2025వ తేదీ నుండి మే 20, 2025 వ తేదీలోపు www.idbibank.in లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి.


  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జూన్ 8, 2025 వ తేదీన ఉంటుంది.


Age Limit: 


  20 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్యలో వయస్సు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ IDBI Bank Junior Assistant Manager (JAM), Grade ‘O’ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు మే 02, 2000 వ తేదీ నుండి మే 01, 2005 వ తేదీ మధ్యలో పుట్టి ఉండాలి. 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  IDBI Bank Junior Assistant Manager (JAM) Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ నీ 60% మార్కుల తో పాసై ఉండాలి.

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు తమ బ్యాచులర్స్ డిగ్రీలో 55% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
  ఓన్లీ డిప్లమా కోర్సు చేసిన వారు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు.

  అలాగే కంప్యూటర్స్ పైన ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.

Selection Process: 


  IDBI Bank Junior Assistant Manager (JAM) Recruitment 2025 రిక్రూట్మెంట్ ను ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 

Online Test: 

లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్ - 60 క్యూస్షన్స్ - 60 మార్కులు - 40 నిమిషాలు. 

ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 20 నిమిషాలు 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు 

జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/కంప్యూటర్/ఐటీ - 60 ప్రశ్నలు - 60 మార్కులు - 25 నిమిషాలు.

  సెక్షనల్ టైమింగ్ మరియు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. ఈ ఆన్లైన్ టెస్టులో మెరిట్ ను బట్టి ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

  ప్రతి తప్పు సమాధానానికి 1/4th లేదా 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

  ఎగ్జామ్ జూన్ 8 2025 వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది.

Personal Interview: 

  ఆన్లైన్ టెస్టులో మెరిట్ ఆధారంగా వేకెన్సీస్ బేస్ మీద కట్ ఆఫ్ ను నిర్ణయించి పర్సనల్ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాటగిరి వైజ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 

  ఈ పర్సనల్ ఇంటర్వ్యూను 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.

Application Fee: 


  ఈ IDBI Bank Junior Assistant Manager (JAM) Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1050 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

  ఈ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. మే 8, 2025వ తేదీ నుండి జూన్ 02, 2025 వ తేదీలోపు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

Examination Centers: 


  Andhra Pradesh: ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం.

  Telangana: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

Salary:  ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే పర్ ఇయర్ కి 6.14 Lakhs నుండి  6.50 Lakhs మధ్యలో సాలరీ ఉంటుంది.

అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని అప్లై చేసుకోండి. 

Official Website: www.idbibank.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు