Ad Code

Responsive Advertisement

Indian Air force Recruitment 2025 in telugu/Agniveervayu Intake 02/2026: ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉద్యోగాలు.

 Indian Air force Recruitment 2025 in telugu/Agniveervayu Intake 02/2026: ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉద్యోగాలు.


Indian Air force Recruitment 2025 in telugu/Agniveervayu Intake 02/2026: ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉద్యోగాలు.



  Indian Air force 2nd batch కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ Indian Air force Agniveervayu Intake 02/2026 Recruitment 2025 కోసం అన్ మ్యారీడ్ మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

  ఈ Indian Air force Agniveervayu Recruitment 2025 కోసం అభ్యర్థులు జులై 11, 2025 వ తేదీ నుండి జులై 31, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్స్ ను నిర్వహించడం జరుగుతుంది. 

Educational Qualification For Agniveervayu Intake 02/2026 in telugu:


 Science Subjects: అభ్యర్థులు ఇంటర్మీడియట్లో లేదా 10+2 లేదా ఈక్వాలెంట్ లో ఫిజిక్స్, మ్యాత్స్ మరియు ఇంగ్లీషు సబ్జెక్టులతో 50% మార్కులతో పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంగ్లీషులో 50% మార్క్స్ వచ్చి ఉండాలి.

  లేదా 

  మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మూడు సంవత్సరముల డిప్లమా కోర్సు చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిప్లమాలో 50% మార్కులతో అభ్యర్థులు పాసై ఉండాలి. అలా అని ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% వచ్చి ఉండాలి. (డిప్లమాలో ఇంగ్లీష్ సబ్జెక్టు లేకుంటే పదవ తరగతి లో 50% మార్కులతో పాసై ఉండాలి.)

  లేదా 

  ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ లో రెండు సంవత్సరముల ఒకేషనల్ కోర్సు చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకేషనల్లో 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లీషు సబ్జెక్టులో 50% మార్కులు వచ్చి ఉండాలి. (ఒకవేళ తమ వోకేషనల్ లో ఇంగ్లీష్ సబ్జెక్టు లేకుంటే పదవ తరగతి లో ఇంగ్లీషులో 50% మార్కులతో పాసై ఉండాలి.)

Other than Science Subjects: ఇంటర్మీడియట్/10+2/ఈక్వలంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే 50% మార్కులతో ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలానే ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు వచ్చి ఉండాలి. 

  లేదా 

 రెండు సంవత్సరముల ఒకేషనల్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకేషనల్ లో 50% మార్కులతో పాసై ఉండాలి. అలానే ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు వచ్చి ఉండాలి. (ఒకేషనల్ లో ఇంగ్లీష్ సబ్జెక్టు లేకుంటే పదవ తరగతిలో ఇంగ్లీషులో 50% మార్కులు వచ్చి ఉండాలి.)


Height: 

  పురుషులు: 152 సెంటీమీటర్లు
  మహిళలు: 152 సెంటీమీటర్లు 

Weight: వెయిట్ వచ్చేసి హైట్ ని బట్టి తీసుకోవడం జరుగుతుంది.

Chest: 

  పురుషులు: మినిమం 77 సెంటీమీటర్లు. ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్లు.
మహిళలు: మినిమం ఎక్స్టెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి.

Age Limit:


  జులై 2, 2005 వ తేదీ నుండి జనవరి 2, 2009వ తేదీ మధ్య పుట్టిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:


  మూడు స్టేజెస్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Phase -I: Online Test:

  Science Subjects: 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఫిజిక్స్, మాథ్స్ మరియు ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 10+2 లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది.

 Other than Science Subjects: 45 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

  Science Subjects & Other than Science Subjects: 85 నిమిషాల పాటు ఎగ్జాంలో నిర్వహించడం జరుగుతుంది. 

ప్రతి సరైన సమాధానానికి ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కలపడం గాని తీసివేయడం గాని జరగదు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

Phase - 2: Physical Fitness Test(PFT):

  పురుషులు: 1.6 కిలోమీటర్లను 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.
  మహిళలు: 1.6 కిలోమీటర్లను 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.


తర్వాత 10 పుష్యప్స్, 10 సిటప్స్, 20 స్కాట్స్ నిర్వహించడం జరుగుతుంది. మహిళలకు పుష్యప్స్ నిర్వహించరు.

Phase -3: Medical Examination


Application Fee: 


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 550 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు