Ad Code

Responsive Advertisement

AP New Ration Card 2025 Apply: ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కార్డుల కోసం అప్లై చేసుకోండి.

 AP New Ration Card 2025 Apply:  ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కార్డుల కోసం అప్లై చేసుకోండి.

AP New Ration Card 2025 Apply:  ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కార్డుల కోసం అప్లై చేసుకోండి.


 ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు AP New Ration Card 2025 Apply కి సంబంధించి మే 06, 2025వ తేదీన ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయన తెలిపిన రేషన్ కార్డుల గురించి ప్రధాన అంశాలు చూద్దాం. 


  ఇందులో ఆయన 07 మే 2025 వ తేదీ నుండి రేషన్ కార్డుకు సంబంధించి ఆరు రకాల సర్వీస్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ 6 సర్వీసులను సచివాలయం కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.


1) కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూసేవారు అప్లై చేసుకోవచ్చు.


2) స్ప్లిట్టింగ్: ఒక కుటుంబంలోని యువకుడికి పెళ్లి అయి ఉంటే, అతను మరియు తన భార్య కోసం కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అలా వారి తల్లి, తండ్రులకు మరియు కొత్త దంపతులు రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు.


3) రేషన్ కార్డులో మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. తమ పిల్లని లేదా ఎవరైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆడ్ చేసుకోవచ్చు. 


4) రేషన్ కార్డులో అడ్రస్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఒక చోట నుండి ఇంకో చోటికి మారి ఉంటే అడ్రస్ ను చేంజ్ చేసుకోవచ్చు. 


5) రేషన్ కార్డులు నెంబర్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటే అటువంటి వారిని రేషన్ కార్డులో డిలీట్ చేసుకోవచ్చు.


6) రైస్ కార్డు వద్దు అనుకునేవారు సరెండర్ చేసుకోవచ్చు. 


ఈ ఆరు సర్వీసులను సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదంటే, ఈ AP New Ration Card 2025 Apply కి సంబంధించి సర్వీసులను మే 12 వ తారీకు నుండి సచివాలయానికి వెళ్లకుండా, తమకు తాము సొంతంగా వాట్స్అప్ గవర్నెన్స్ ద్వారా కూడా పొందవచ్చు.


ఏపీ సీనియర్ సిటిజన్ కార్డు కోసం అప్లై చేసుకోండి.


ఇప్పుడు వచ్చే రేషన్ కార్డు స్మార్ట్ కార్డుకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే గత ఆరు నెలల రేషన్ కి సంబంధించి వివరాలు రావడం జరుగుతుంది. 


 ఈకేవైసీ అనేది దాదాపు 95% అయిపోయింది. ఇంకా ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈకేవైసీ అవసరం లేదు. 80 సంవత్సరాల పైబడిన వారికి కూడా ఈకేవైసీ అవసరం లేదు. జూన్ నుండి ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులను 1,46,21,223 మందికి మంజూరు చేయనున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డుల మార్పుల కోసం 3.28 లక్షల అప్లికేషన్లు వచ్చాయని మంత్రి వర్యులు తెలిపారు. ఈకేవైసీ పూర్తయిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. 


  ఈసారి కూడా ప్రభుత్వం రేషన్ కార్డులను ఏటీఎం కార్డు రూపంలో రూపొందించి పంపిణీ చేయనుంది. ఏటీఎం కార్డు రూపంలో ఉన్న రేషన్ కార్డులో ముందు పక్కలో ఎవరి పైన అయితే రేషన్ కార్డు వస్తుందో వారి ఫోటో మరియు వివరాలు ఉంటాయి. అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. రేషన్ కార్డు వెనుక పక్క మిగతా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు చాలా క్లారిటీగా కనబడే విధంగా ఉంటాయి. 

  రేషన్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేయగానే, గత ఆరు నెలల్లో మీరు రేషన్ కార్డు ఎక్కడ తీసుకున్నారో, ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఏ షాప్ లో తీసుకున్నారు అని వివరాలు మొత్తం రావడం జరుగుతుంది. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా రేషన్ కార్డు యొక్క ఆరు నెలల డేటా చూపించడం జరుగుతుంది.

  ఈ AP New Ration Card 2025 స్మార్ట్ కార్డును ఎవరి పార్టీలకు సంబంధించిన ఫోటోలు లేకుండా డిజైన్ చేశామని మంత్రి వర్యులు తెలియజేశారు.


  హౌస్ మ్యాపింగ్ డేటా ఏ విధంగా అయితే ఉంటే, అదేవిధంగా ఈ రేషన్ కార్డులు రావడం జరుగుతుంది. 


  రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా సందేశాలు ఉంటే 1967 కు ఫోన్ చేయండి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు