GMC & GTGH Rajamahendravaram Notification 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

 GMC & GTGH Rajamahendravaram Notification 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

GMC & GTGH Rajamahendravaram Notification 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు


  గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం లో ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


  ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 ద్వారా


 ఆఫీసు సబార్డినేట్ - GMC లో 9 పోస్టులు, GTGH లో 16 పోస్టులు = మొత్తం 25

 అనతీస్య టెక్నీషియన్ - GTGH - 2 పోస్టులు

 కర్డియాలజీ టెక్నీషియన్ - GTGH - 3 పోస్టులు 

 ల్యాబ్ టెక్నీషియన్ - GTGH 2 పోస్టులు 

 ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ - GTGH 2 పోస్టులు 

 జనరల్ డ్యూటీ అటెండెంట్ - GMC లో 1, GTGH లో 19 = మొత్తంగా 20 పోస్టులు

 స్టోర్ అటెండెంట్ - GTGH లో 3 పోస్టులు 

 ల్యాబ్ అటెండెంట్ - GMC లో 1

 ECG టెక్నీషియన్ - GTGH లో 1

 లైబ్రరీ అసిస్టెంట్ - GMC లో 1

  మొత్తంగా GMC లో 12 పోస్టులను మరియు GTGH లో 48 పోస్టులను టోటల్గా 60 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. క్యాటగిరి వైజ్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


 ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 26, 2025 వ తేదీ ఉదయం 10:00 నుండి జనవరి 9, 2026వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.


Age Limit:


 ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 1, 2025. 

 ఎస్సీ, ఎస్టి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

 ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజు రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification:


 ఆఫీసు సబార్డినేట్ - పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


 జనరల్ డ్యూటీ అటెండెంట్ - పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


 స్టోర్ అటెండెంట్ - పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


 లైబ్రరీ అసిస్టెంట్ - ఇంటర్మీడియట్ పాసై CLISc(సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్స్) కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.


 అనతీస్య టెక్నీషియన్ - సైన్స్ గ్రూప్స్లో ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అనతీస్య టెక్నీషియన్ లో 2 సంవత్సరముల డిప్లమా చేసి ఉండాలి. అలాగే APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.


 కర్డియాలజీ టెక్నీషియన్ - బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.  కార్డియాలజీ టెక్నీషియన్ లో 2 సంవత్సరాల డిప్లమా చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రో కార్డియోగ్రఫీలో 2 సంవత్సరముల డిప్లమా చేసి ఉండాలి.

 లేదా

 Cardiovascular టెక్నాలజీ లో బీఎస్సీ చేసి ఉండాలి. అలాగే APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి. 


 ల్యాబ్ టెక్నీషియన్ - DMLT or B. Sc (MLT) చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ చేసి ఒక సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్ లో అప్రెంటీస్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి. మిగతా వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


 ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ - మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ లో డిప్లమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.


 ల్యాబ్ అటెండెంట్ - పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ ఒకేషనల్ కోర్సు) చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.


 ECG టెక్నీషియన్ - అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ కోర్సు లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.


Selection Process:


 ఈ GMC & GTGH Rajamahendravaram Notification 2025 కోసం ఎటువంటి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించి పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోండి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు లోకల్ క్యాండిడేట్స్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

How To Apply:

  అభ్యర్థులు ముందుగా అఫీషియల్ అప్లికేషన్ ఫారం ను ప్రింట్ చేయించుకోవాలి. నోటిఫికేషన్ లో అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. అన్ని తీసుకొని office of the Principal / Addl. DME, Government Medical College, Rajamahendravaram అడ్రస్ కు వెళ్లి అందజేయాలి. జనవరి 9, 2026వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలి.


Application Fee:

  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు Principal, Government Medical College, Rajamahendravaram పేరుమీద డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి. ఓసి అభ్యర్థులు 300 రూపాయలను, బీసీ, ఈ డబ్ల్యూ ఎస్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 200 రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.


Notification PDF 


Official Website: https://eastgodavari.ap.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు