CCI(COTTON CORPORATION OF INDIA) Recruitment 2025 in telugu: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్.
THE COTTON CORPORATION OF INDIA(CCI) LTD, mumbai నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్ మే 9వ తేదీన విడుదల అయింది. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ బేసిస్ క్రింద భర్తీ చేస్తున్నారు.
ఈ CCI Recruitment 2025 కోసం విద్యార్థులు మే 09, 2025వ తేదీ నుండి మే 24, 2025 వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.cotcorp.org.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ CCI Recruitment 2025 ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - 10 పోస్టులను, మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) - 10 పోస్టులను, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ - 125 పోస్టులను, జూనియర్ అసిస్టెంట్ (కాటన టెస్టింగ్ ల్యాబ్) - 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా CCI Recruitment 2025 ద్వారా 147 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్యాటగిరి వైజ్ పోస్టులను మీరే ఆఫీసియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Age Limit:
ఈ CCI Recruitment 2025 ఈ అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజు రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్):
అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసి ఉండాలి/అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఈక్వలెంట్ లో ఎంబీఏ చేసి ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్):
CA/CMA
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్:
ఏదైనా యూనివర్సిటీ నుండి బిఎస్సి అగ్రికల్చర్ లో 50% మార్కులతో పాసై ఉండాలి.
ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్ అభ్యర్థులు 45% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది.
THE COTTON CORPORATION OF INDIA(CCI) LTD ఎంప్లాయ్ అయి ఉంటే, అటువంటివారు ఏదైనా డిగ్రీ అర్హత తో ఈ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ అసిస్టెంట్ (కాటన టెస్టింగ్ ల్యాబ్):
ఎలక్ట్రికల్స్/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లమా లో 50% మార్కులతో పాసై ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 45% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
Selection Process:
సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అలాగే సిలబస్ ను కూడా చూసుకోండి.
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. మూడు సంవత్సరాల బాండ్ పై సైన్ చేయాల్సి ఉంటుంది.
Application Fee:
ఈ CCI Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Examination Centers:
ముంబై, హైదరాబాదు, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగర్, కోల్కత్తా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్.
అభ్యర్థుల అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Salary:
మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - Rs 30,000 – 1,20,000
మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) - Rs 30,000 – 1,20,000
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ - Rs 22000-90000
జూనియర్ అసిస్టెంట్ (కాటన టెస్టింగ్ ల్యాబ్) - Rs 22000-90000
0 కామెంట్‌లు