Ad Code

Responsive Advertisement

AP High court Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఉద్యోగాలు.

 AP High court Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఉద్యోగాలు.


AP High court Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఉద్యోగాలు.



  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో High court లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.  ఈ AP High court Recruitment 2025 in telugu ద్వారా 1621 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ AP High court Recruitment 2025 ద్వారా పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  ఈ AP High Court Recruitment 2025 మే 06, 2025వ తేదీన విడుదల అయింది. అభ్యర్థులు మే 13, 2025 వ తేదీ నుండి జూన్ 02, 2025వ తేదీలోపు https://aphc.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.

AP High Court Recruitment 2025 ద్వారా 

జూనియర్ అసిస్టెంట్: 230

ఆఫీసు సబార్డినేట్: 651

ఫీల్డ్ అసిస్టెంట్ : 56

ఎగ్జామినేర్ : 32

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3: 80

డ్రైవర్ లైట్ వెహికల్: 28

టైపిస్టు: 162

రికార్డు అసిస్టెంట్: 24

ప్రాసెస్ సర్వేర్: 164

కాపీస్ట్: 194

టోటల్గా 1621 ఉద్యోగాలను ఈ AP High Court Recruitment 2025 ద్వారా భర్తీ చేస్తున్నారు.

Age Limit: 


  18 సంవత్సరాల నుండి 42 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. (ఈ ఏజ్ లిమిట్ ను జులై 01, 2025 వ తేదీనీ ఆధారంగా చేసుకుని లెక్క వేసుకోవాలి.)

  ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులకు 05 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఫిజికల్ హ్యాండ్ క్యప్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది. 
  
  ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



Educational Qualification: 


Junior Assistant: ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కి అప్లై చేసుకోవచ్చు.
  అయితే కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి.

ఆఫీసు సబార్డినేట్ : 7th పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి లేదా అంతకన్నా తక్కువ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోకూడదు.

ఫీల్డ్ అసిస్టెంట్: ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కి అప్లై చేసుకోవచ్చు.

ఎగ్జామినేర్ & రికార్డు అసిస్టెంట్: ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఎగ్జామినర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3: ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 

  ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో పాస్ అయి ఉండాలి. మరియు ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లేదా ఈక్వలెంట్ లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి పాసై ఉండాలి.
 కంప్యూటర్ ఆపరేషన్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి.

డ్రైవర్ లైట్ వెహికల్: 7th పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి లేదా అంతకన్నా తక్కువ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోకూడదు.
లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.

టైపిస్టు: ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 
  అలాగే ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లేదా ఈక్వాలెంట్ లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో పాస్ అయి ఉండాలి.
  అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ప్రాసెస్ సర్వేర్: పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాల కి అప్లై చేసుకోవచ్చు.

కాపీస్ట్: ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీషు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో పాస్ అయి ఉండాలి.

Selection Process: 


Junior Assistant & ఆఫీసు సబార్డినేట్ & ఫీల్డ్ అసిస్టెంట్ & ఎగ్జామినేర్ & రికార్డు అసిస్టెంట్ & ప్రాసెస్ సర్వేర్: మల్టిపుల్ ఛాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నీ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 80 ప్రశ్నలకు గాను 80 మార్కులు చొప్పున 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3: మల్టిపుల్ ఛాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నీ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 80 ప్రశ్నలకు గాను 80 మార్కులు చొప్పున 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 

  తర్వాత స్కిల్ టెస్ట్ ను 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.

డ్రైవర్ లైట్ వెహికల్: 80 మార్కులకు 80 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు  ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 20 మార్కులకు స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

టైపిస్టు: 80 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 50 మార్కులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.

Application Fee: 

  ఈ AP High court Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఓసి, బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

  అప్లికేషన్ ఫీజు అనేది జూన్ 02, 2025 లోపు
 చెల్లించాలి.

   అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్లు చదువుకొని రెస్పెక్ట్ వైస్ గా పోస్టులను చూసుకోండి. అలాగే అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Official Website: https://aphc.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు