Ad Code

Responsive Advertisement

NSM Recruitment 2025 in Telugu: ఇంటర్ మరియు ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు

 NSM Recruitment 2025 in Telugu: ఇంటర్ మరియు ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు

NSM Recruitment 2025 in Telugu: ఇంటర్ మరియు ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు


  National Council of Science Museums(NCM), Kolkata నుండి Recruitment విడుదల అయింది. ఈ National Council of Science Museums (NSM) అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. 


  ఈ NSM Recruitment 2025 కోసం మే 23, 2025 వ తేదీలోపు https://ncsm.gov.in/notice/career వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.


  ఈ NSM Recruitment 2025 ద్వారా టెక్నీషియన్ - ఏ, టెక్నికల్ అసిస్టెంట్ - ఏ, ఆర్టిస్టు - ఏ, ఆఫిస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


Technician-‘A’ : 13 పోస్టులు ( ఫిట్టర్ - 05, కార్పెంటర్ - 06, ఎలక్ట్రానిక్స్ - 01, ఎలక్ట్రికల్ - 01) 


Technical Assistant-‘A’: 09 పోస్టులు ( ఎలక్ట్రానిక్స్ - 01, కంప్యూటర్ - 02, ఎలక్ట్రికల్ - 02, మెకానికల్ - 02, సివిల్ - 02) 


Artist-‘A’: 02 పోస్టులు 


Office Assistant Gr.III: 06 పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.


  యూనిట్స్(మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది) మరియు క్యాస్ట్ వైస్ కేటగిరీకి సంబంధించిన పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

ఈ ఉద్యోగాలు అన్నీ పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.


Educational Qualification: 



Technician-‘A’ :  పదవ తరగతి చదివి ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లో ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఐటిఐ లో రెండు సంవత్సరాల కోర్సు చేసిన అభ్యర్థులు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఐటిఐ లో ఒక సంవత్సరం కోర్సు చేసిన అభ్యర్థులు రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 


Technical Assistant-‘A’: Technical Assistant-‘A’ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ పోస్టులకు మూడు సంవత్సరముల డిప్లమా కోర్సు కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
  Technical Assistant-‘A కంప్యూటర్ పోస్ట్ కి అప్లై చేయాలి అంటే కంప్యూటర్ సైన్స్ లో డిప్లమా చేసి ఉండాలి లేదా NIELIT లెవెల్ డిప్లమా చేసి ఉండాలి/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ డ్యూలీ రికగ్నైసేడ్ ఇన్స్టిట్యూషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA)/ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. 

Office Assistant Gr.III: 10+2 లేదా 12th క్వాలిఫికేషన్ కలిగిన క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ కి అర్హులు. అలాగే గవర్నమెంట్ రికగ్నైసేడ్ ఇన్స్టిట్యూషన్ నుండి 35 వర్డ్స్ ఫర్ మినిట్ కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

మిగతా వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Artist-‘A’: అర్హతను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.





Age Limit: 


Technician-‘A’ :  18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ టెక్నీషియన్ ఏ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.

SC కి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Technical Assistant-‘A’: ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఏ పోస్ట్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.

ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరములు ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. మీ క్వాలిఫికేషన్ ఏంటో అండ్ క్యాటగిరి ఏంటో ఒకసారి పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 


Office Assistant Gr.III:  ఈ ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Artist-‘A’: 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఆర్టిస్టు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 

Application Fee: 

 ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 885 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 
  అప్లికేషన్ ఫీజును మే 23, 2025వ తేదీ లోపు చెల్లించాలి.

 మీరు అప్లై చేసుకునేటప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. 

Salary: 

  Technician-‘A’ : ఈ పోస్టుకి సెలెక్ట్ అయినట్లయితే శాలరీ అనేది Rs.19,900-63,200 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ పోస్టులు లెవెల్-2 పోస్టులు. అన్ని కలుపుకొని కోల్కత్తాలో అయితే నెలకి Rs.38,908 రూపాయల జీతం ఉంటుంది. భువనేశ్వర్ లో అయితే నెలకి Rs.36,220 రూపాయల జీతం ఉంటుంది.

Technical Assistant-‘A’: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే జీతం అనేది Rs.29,200-92,300 రూపాయలు నెలకి రావడం జరుగుతుంది. అన్ని కలుపుకొని Rs.59,600 రూపాయలు కలకత్తాలో రావడం జరుగుతుంది. భువనేశ్వర్ లో గనుక జాబు వస్తే అన్ని కలుపుకొని Rs.53,890 శాలరీ రావడం జరుగుతుంది.

Office Assistant Gr.III: ఈ ఉద్యోగం గనక మీకు వస్తే నెలకి Rs.19,900-63,200 రూపాయల మధ్యలో జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని కలకత్తాలో జాబు వస్తే Rs.38,908 రూపాయల జీతం ఉంటుంది. Dhenkanal లో జాబు వస్తే Rs.34,230 రూపాయల సాలరీ ఉంటుంది. 

Artist-‘A’: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ప్రతినెల Rs.19,900-63,200 మధ్యలో జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని కలకత్తాలో నెలకు Rs.38,908 రూపాయల జీతం ఉంటుంది.

Official Website: https://ncsm.gov.in/notice/career

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు