Ad Code

Responsive Advertisement

CSIR Madras Complex Recruitment 2025 in telugu: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

 CSIR Madras Complex Recruitment 2025 in telugu: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

CSIR Madras Complex Recruitment 2025 in telugu: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు


CSIR Madras Complex, Chennai నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ క్యాంపస్, తరమని, చెన్నై నుండి విడుదల అయింది.


  ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్) - హిందీ - 01 (అధర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబిసి)) పోస్టును, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ) - 2 (ఇందులో ఒక పోస్టు జనరల్ అభ్యర్థులకి మరియు ఇంకో పోస్టు షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీ) అభ్యర్థులకు) పోస్టులను, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేస్) - 01(ఈ ఒక పోస్టును ఈడబ్ల్యూఎస్ (ఎకనామిక వీకర్ సెక్షన్) అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.) పోస్టును, జూనియర్ స్టెనోగ్రాఫర్ - 04 (ఈ నాలుగు పోస్టులలో జనరల్ అభ్యర్థులకు 3 పోస్టులు, ఓ బి సి (అధర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులకు 1 పోస్టును కేటాయించడం జరిగింది.) పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


  ఈ నోటీఫికేషన్ కోసం ఏప్రిల్ 17, 2025 వ తేదీ ఉదయం 9:00 నుండి మే 19 2025 సాయంత్రం 5 గంటలలోపు www.csircmc.res.in website లో online లో అప్లై చేసుకోవాలి. 

  ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. 


Educational Qualification: 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఎఫ్ అండ్ ఏ, స్టోర్స్ అండ్ పర్చేస్) ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/XII లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అయితే సెలక్షన్ ప్రాసెస్ లో ఈ పోస్టులకి టైపింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. 

  జూనియర్స్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/XII లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్లో ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ ను నిర్వహించడం జరుగుతుంది. 

Age Limit: 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్) పోస్టులకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు వయసు అనేది 18 నుండి 31 సంవత్సరాల మధ్య ఉండాలి. 

  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ) ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్య ఏజ్ ను కలిగి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అంటే 33 సంవత్సరాల లోపు వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు.


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేస్) పోస్టులకి ఎలిజిబుల్ వయసు ఏమిటంటే కనిష్టంగా 18 సంవత్సరాల ను కలిగి గరిష్టంగా 28 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ను కలిగి ఉండాలి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబిసి) అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబిసి అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు. 

అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి పైన తెలిపిన క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు అన్ రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే వారికి ఏజ్ లిమిట్ వర్తించదు.

  ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మే 19, 2025.

Method of selection: 


  ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు కాంపిటీటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్ అనేది చెన్నైలో నిర్వహించడం జరుగుతుంది.

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఎఫ్ అండ్ ఏ, స్టోర్స్ అండ్ పర్చేస్) ఉద్యోగాల నీ రిటర్న్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్టు ద్వారా భర్తీ చేస్తారు.
రిటర్న్ ఎగ్జామ్ లో పేపర్ 1 మరియు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే. మెరిట్ అనేది పేపర్ 2 నుండి తీయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్టు కూడా క్వాలిఫైంగ్ మాత్రమే.

  జూనియర్స్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను రిటర్న్ ఎగ్జామ్ మరియు స్టెనోగ్రాఫర్ ప్రొఫెషియన్సి టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రమే. మెరిట్ అనేది రిటర్న్ ఎగ్జామ్స్ నుండి తీయడం జరుగుతుంది.

Application Fee: 


  జనరల్, ఓబిసి మరియు ఈడబ్ల్యూఎస అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి అంటే 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించండి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 

మీరు అప్లై చేసుకునేటప్పుడు ఛాయిస్ ఆఫ్ మీడియం ను మీరు ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాస్తారు, ప్రొఫిషియన్సీ టెస్టు ను ఏ లాంగ్వేజ్ లో చేస్తారు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వండి. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మళ్లీ చేంజ్ చేయాలి అంటే కుదరదు. 

  ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మే 19 లోపు www.csircmc.res.in వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

  ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషను ప్రింట్ అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్ అవుట్ పై సైన్ చేయండి. మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించిన ఆ రిసిప్ట్ ను తీసుకోండి, అప్లికేషన్ ఫామ్ పై కలర్ ఫోటో అంటించి అక్రాస్ గా సైన్ చేయాలి, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, మీయొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్స్, ఏవైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఉంటే అవి అప్లికేషన్ ఫామ్ తో పాటు సెల్ఫ్ అటాచ్ చేసి మీరు ఏ పోస్ట్ కైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో పోస్ట్ కోడ్ నెంబర్ రాసి అప్లికేషన్ లో తెలిపిన అడ్రస్ కు 29 మే లోగా చేరేలోగా చూడండి. వీటి గురించి అఫీషియల్ నోటిఫికేషన్ లో క్షుణ్ణంగా చదువుకోండి.

  Imp Dates: 


   ఆన్లైన్ లో అప్లికేషన్ మొదలయ్యే తేదీ: 17-04-2025
  ఆన్లైన్లో అప్లికేషన్ లాస్ట్ తేదీ: 19-05-2025
  ఫీజు కట్టడానికి చివరి తేదీ: 19-05-2025
  ఆఫ్ లైన్ లో హార్డ్ కాపీస్ ను 29-05-2025 వ తేదీలోపు   పంపాలి.

Official Website: www.csircmc.res.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు