IIIT Bhopal Recruitment 2026
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భూపాల్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IIIT Bhopal Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
IIIT Bhopal Recruitment 2026 ద్వారా
జూనియర్ సూపరిండెంట్ - 1 పోస్టు
జూనియర్ టెక్నీషియన్ - 1 పోస్టు
జూనియర్ అసిస్టెంట్ - 1 పోస్టు
భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసం జులై 15, 2026వ తేదీ నుండి ఆగస్టు 8, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూనియర్ సూపరిండెంట్: 18 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ టెక్నీషియన్/జూనియర్ అసిస్టెంట్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
జూనియర్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి, కంప్యూటర్ ఆపరేషన్స్ పై నాలెడ్జ్ కలిగిన వారు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా పూర్తి నోటిఫికేషన్ను చదువుకొని క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://iiitbhopal.ac.in/ లో జూలై 15, 2026వ తేదీ నుండి ఆగస్టు 8, 2026వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://iiitbhopal.ac.in/

0 కామెంట్లు