పదవ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు: AP Anganwadi Jobs 2026 in telugu

AP Anganwadi Jobs 2026 in telugu 



AP Anganwadi Jobs 2026 in telugu


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల  అవుతున్నాయి. ప్రస్తుతం ఒక జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ అంగన్వాడి నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. 

  ఈ అంగన్వాడి నోటిఫికేషన్ ద్వారా 230 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కేవలం పదవ తరగతి అర్హతతో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 

  ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం జూన్ 9, 2026వ తేదీ నుండి జూన్ 18, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Age Limit:


  జూలై 1, 2026 వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 

Educational Qualification:


  అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. 
  అభ్యర్థులు వివాహితులు అయి ఉండాలి. 
  అభ్యర్థులు ఆ గ్రామానికి చెందిన స్థానికులు అయి ఉండాలి.

How To Apply:

  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫారం ను తీసుకొని పూర్తిగా పూరించాలి. తర్వాత  అఫీషియల్ నోటిఫికేషన్ లో అడిగినటువంటి కుల ధ్రువీకరణ పత్రం, నివాసము, పుట్టిన తేదీ, పదవ తరగతి మార్కు లిస్టు, ఆధార్, వికలాంగులు అయితే సంబంధిత సర్టిఫికేట్ అన్నింటిని గజిటెడ్ సైన్ చేపించి అప్లికేషన్ ఫారంకు జత చేయాలి. అన్నింటిని తీసుకొని సంబంధిత CDPO కార్యాలయం నందు అందజేయవలెను.

Selection Process:

  అయితే డిక్టేషన్ ను నిర్వహించడం జరుగుతుంది. మేజర్ గా మెరిట్ లిస్టును బట్టి ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

Salary:

  అంగన్వాడీ కార్యకర్త - రూ.11,500 నెలకు 

  అంగన్వాడి సహాయకురాలు - రూ. 7,000 నెలకు 

పోస్టుల వివరాలు:

  ఈ నోటిఫికేషన్ శ్రీ సత్య సాయి జిల్లా నుండి విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 230 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  కదిరి - 70 పోస్టులు 
  నల్లచెరువు - 51 పోస్టులు 
  ధర్మవరం - 21 పోస్టులు 
  బత్తలపల్లి - 63 పోస్టులు 
  సి.కే. పల్లి - 23 పోస్టులు 

 మీ పరిధిలో వేకెన్సీలు ఉన్నాయో లేదో అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

Notification PDF 









.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు