10+2 (B.Tech) CADET ENTRY SCHEME Recruitment 2026
ఇండియన్ నేవీ నుండి 10+2 (బీటెక్) కాడేట్ ఎంట్రీ స్కీమ్ కింద 60 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయితే వారే బీటెక్ చదివించి తర్వాత పర్మినెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఈ 10+2 (B.Tech) CADET ENTRY SCHEME Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 60 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ - 30 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 30 పోస్టులు
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 29, 2026 వ తేదీ నుండి జూన్ 18, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
జులై 2, 2007వ తేదీ నుండి జనవరి 1, 2010 వ తేదీ మధ్య పుట్టిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
ఇంటర్మీడియట్ లో MPC గ్రూపు తీసుకుని 70% మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మినిమం 50% మార్కులతో పాసై ఉండాలి (పదవ తరగతి లేదా ఇంటర్).
అభ్యర్థులు JEE (mains) రాసి ఉండాలి. అభ్యర్థులకు కామన్ రాంక్ లిస్ట్ (CRL) తెలిసి ఉండాలి.
అన్ మ్యారీడ్ పురుషులు మరియు మహిళలు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి.
Selection Process:
జేఈఈ మెయిన్స్ లో వచ్చిన మార్పుల ఆధారంగా చేసుకొని విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ అయినా విద్యార్థులను SSB ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.joinindiannavy.gov.in/ లో మే 29, 2026వ తేదీ నుండి జూన్ 18, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://www.joinindiannavy.gov.in/

0 కామెంట్లు