AP Koushalam Apply In Mobile: మీ మొబైల్ లోనే కౌశలం వర్క్ ఫ్రం హోం జాబ్స్ కి అప్లై చేసుకోండి
ఏపీ కౌశల్యం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం అభ్యర్థులు తమ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. AP Koushalam Apply In Mobile ను ఇప్పుడు చూద్దాం. ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అభ్యర్థులు Mobile లో ఎలా Apply చేసుకోవాలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సువర్ణ అవకాశం ఇస్తోంది. రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారికి ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి కౌశలం అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించనుంది.
ఈ కౌశలం వర్క్ ఫ్రం హోం జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ (Eligibility , Age Limit, Salary) కావాలి అంటే క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
AP Koushalam Work From Home Jobs
ఈ కౌశలం వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
సచివాలయం దగ్గరకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా అభ్యర్థులు తమ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు.
ఈ AP Koushalam Survey కి మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది చూసుకోండి.
How To Apply For AP Koushalam Survey In Mobile:
మొబైల్ లో అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు పైన ఉన్న Click Here లింకుపై క్లిక్ చేయండి.
(ప్రస్తుతం లాప్టాప్/ డెస్క్ టాప్ లో మాత్రమే Work From Home Module లింక్ ఓపెన్ అవుతుంది. మొబైల్ లో చూపించడం లేదు)
తర్వాత Work From Home Module పై క్లిక్ చేయండి.
తర్వాత డాష్ బోర్డు ఆధార్ అతంటికేషన్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న బాక్స్ పై టిక్ మార్క్ చేయండి.
తర్వాత మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి, సెండ్ ఓటిపి పై క్లిక్ చేయండి. ఆధార్ కు ఏ మొబైల్ నెంబరు అయితే లింకు అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కు ఓటిపి రావడం జరుగుతుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
సబ్మిట్ చేయగానే మీ ఫుల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, స్టేట్, డిస్ట్రిక్ట్ వివరాలు రావడం జరుగుతుంది చూసుకోండి. తరువాత మీరు డైలీ యూస్ చేసే మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి గెట్ ఓటిపి పై క్లిక్ చేయండి. ఓటిపి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఓకే పై క్లిక్ చేయండి.
తర్వాత వ్యాలీడ్ ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి. గెట్ ఓటిపి పై క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఓకే పై క్లిక్ చేయండి.
పదవ తరగతి, ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఇక్కడి వరకు చేస్తే సరిపోతుంది. ఐటిఐ, డిప్లమా, గ్రాడ్యుయేషన్ లేదా ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగిన వారు కింది వివరాలను ఎంటర్ చేయండి.
తర్వాత మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
మీ క్వాలిఫికేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ స్టడీ కంప్లీట్ అయిందా లేదా ఇంకా చదువుతున్నారా సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ క్వాలిఫికేషన్ లో స్పెషలైజేషన్ ఏమిటో సెలెక్ట్ చేసుకోండి.
పర్సంటేజ్ ఆ లేదా సిజిపిఏ నా సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ లేదా సిజిపిఏ ను ఎంటర్ చేయండి.
మీరు ఏ సంవత్సరంలో పాసయ్యారో ఎంటర్ చేయండి.
తర్వాత లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ మీరు ఏపీలో చదివారా లేదా ఏపీ బయట చదివారా లేదా ఇండియా బయట చదివారా సెలెక్ట్ చేయండి.
తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి.
మీరు ఏ యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత సర్టిఫికెట్ దగ్గర చూస్ ఫైల్ పై క్లిక్ చేసి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి.
మీకు ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అధర్ క్వాలిఫికేషన్ దగ్గర Add పై క్లిక్ చేయండి.
ఇంకా మీకు ఏవైనా సర్టిఫికెట్స్ ఉంటే ఆ సర్టిఫికెట్ కి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వండి.
అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు చూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి.
మీకు రిఫరెన్స్ ఐడి జనరేట్ కావడం జరుగుతుంది ఆ ఐడిని జాగ్రత్తగా పెట్టుకోండి.
ఈ AP Koushalam Apply In Mobile ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
Note: ప్రస్తుతం లాప్టాప్/ డెస్క్ టాప్ లో మాత్రమే Work From Home Module లింక్ ఓపెన్ అవుతుంది... మొబైల్ లో చూపించడం లేదు
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు తెలియాలి అంటే మన
telugunetcentre.site వెబ్ సైట్ ను డైలీ సందడించండి.
0 కామెంట్‌లు