Join Indian Coast Guard Recruitment 2025 In Telugu: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.
Join Indian Coast Guard నుండి Assistant Commandant ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Join Indian Coast Guard Recruitment 2025 ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ, టెక్నికల్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు గ్రూప్ ఏ గజిటెడ్ ఉద్యోగాలు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.
ఈ Join Indian Coast Guard Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు జులై 08, 2025 వ తేదీ నుండి జూలై 23, 2025 వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ https://joinindiancoastguard.cdac.in లో అప్లై చేసుకోవాలి.
ఈ Join Indian Coast Guard Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా జనరల్ డ్యూటీ 140 ఉద్యోగాలను, టెక్నికల్ 30 ఉద్యోగాలను మొత్తంగా 170 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
21 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు జులై 01, 2001 వ తేదీ నుండి జూన్ 30, 2005వ తేదీ మధ్యలో పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
General Duty: ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లెవెల్ లో ఫిజిక్స్ మరియు మ్యాత్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. లేదంటే డిప్లమా చేసి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Technical: మెకానికల్/ నావెల్ ఆర్కిటెక్చర్/ మెరైన్/ ఆటోమేటివ్/ మెకాట్రోనిక్స్/ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్/ మెటలర్జీ/ డిజైన్/ ఏరోనాటికల్/ ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా పైన తెలిపిన డిసిప్లెయిన్స్ లో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేదా
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా పైన తెలిపిన డిసిప్లేన్స్ లో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. లేదా డిప్లమా చేసి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులూ అప్లై చేసుకోవచ్చు.
Height: 157 CM
Weight: హైటు మరియు ఏజ్ కి ప్రపోషన్ గా తీసుకోవడం జరుగుతుంది. ±10% రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది.
Chest: ప్రపోషణగా తీసుకోవడం జరుగుతుంది. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్లు ఉండాలి.
Selection Process:
మొత్తంగా 5 స్టేజీలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Stage -1: ఈ స్టేజిలో కంప్యూటర్ బేస్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. 100 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున రెండు గంటల పాటు ఈ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
Stage - 2: ఈ స్టేజ్ టూ లో కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ (CCBT) మరియు పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్ (PP&DS) ను నిర్వహించడం జరుగుతుంది.
Stage - 3: ఫిజికల్ టెస్ట్, గ్రూపు టాస్క్ మరియు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ను నిర్వహించడం జరుగుతుంది.
Stage - 4: స్టేజ్ ఫోర్లో మెడికల్ ఎగ్జామినేషన్ను నిర్వహించడం జరుగుతుంది.
Stage - 5: ఇండెక్సింగ్ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది.
Examination Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
Official Website: https://joinindiancoastguard.cdac.in
0 కామెంట్‌లు