Ad Code

Responsive Advertisement

SSC CHSL Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో 3131 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలు.

 SSC CHSL Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో 3131 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలు.


SSC CHSL Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో 3131 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలు.



  SSC (Staff Selection Commition) నుండి CHSL (Combined Higher Secondary(10+2) Level Examination) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SSC CHSL Recruitment 2025 నోటిఫికేషన్ జూన్ 23, 2025వ తేదీన విడుదల కావడం జరిగింది.

  ఈ SSC CHSL Recruitment 2025 ద్వారా లోవర్ డివిజన్ క్లర్కు/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ SSC CHSL Recruitment 2025 ద్వారా 3131 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది.

  ఈ SSC CHSL Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు జూన్ 23, 2025 వ తేదీ నుండి జూలై 18, 2025వ తేదీ లోపు https://ssc.gov.in వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జూలై 19, 2025. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే జులై 23, 2025 వ తేదీ నుండి జులై 24, 2025 వ తేదీ లోపు కరెక్ట్ చేసుకోవాలి.

  ఈ SSC CHSL Recruitment 2025 కి సంబంధించి టిఆర్ 1 ఎగ్జామ్ ను సెప్టెంబర్ 8, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 18 2025వ తేదీలోపు నిర్వహించడం జరుగుతుంది. టిఆర్ 2 ఎగ్జామ్ ను ఫిబ్రవరి-మార్చి లో నిర్వహించడం జరుగుతుంది.

Age Limit for SSC CHSL Recruitment 2025 in telugu:


  జనవరి 01, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ SSC CHSL Recruitment 2025 ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు జనవరి 2, 1999 నుండి జనవరి 1, 2008 వ తేదీ మధ్యల పుట్టి ఉండాలి.


  ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification For SSC CHSL Recruitment 2025 in telugu:


  జనవరి 01, 2026వ తేదీ నాటికి 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 

  కొన్ని పోస్టులకి 12th స్టాండర్డ్ లో సైన్స్ తో మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన అన్ని పోస్టులకి 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్ది.

Selection Process For SSC CHSL Recruitment 2025 in telugu:


  టిఆర్ - 1 మరియు టిఆర్ - 2 ద్వారా ఈ SSC CHSL Recruitment 2025 ను భర్తీ చేస్తున్నారు. టిఆర్ - 2 లో స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది. 

Tier - 1 Exam For SSC CHSL Recruitment 2025 in telugu:


  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
  జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు

SSC CHSL Recruitment 2025 Tier - 1 కి సంబంధించి ఎగ్జామ్ ను 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో ఉంటుంది. SSC CHSL Recruitment 2025 Tier - 1 ఎగ్జామ్ ను సెప్టెంబర్ 8, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 18 2025వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. Tier - 2 కి సంబంధించి మీరే చూసుకోండి. Tier - 2 కి సంబంధించి ఎగ్జామ్ ను ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించడం జరుగుతుంది.

Application Fee For SSC CHSL Recruitment 2025 in telugu:



  ఈ SSC CHSL Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

    అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జూలై 19, 2025.

Examination Centers For SSC CHSL Recruitment 2025 in telugu:


ఆంధ్రప్రదేశ్ లో: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. 

తెలంగాణ లో: హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి.

Salary For SSC CHSL Recruitment 2025 in telugu:


  లోవర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ - పే లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ₹19,900 నుండి ₹63,200 మధ్య జీతం ఉంటుంది. 

  డేటా ఎంట్రీ ఆపరేటర్ - పే లెవెల్ 4 మరియు లెవెల్ 5 ఉద్యోగాలు. పే లెవెల్ 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ₹25,500 నుండి ₹81,100 మధ్య శాలరీ ఉంటుంది. లెవెల్ 5 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ₹29,200 నుండి ₹92,300 మధ్య జీతం ఉంటుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ - పే లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ₹25,500 నుండి ₹81,100 మధ్య శాలరీ ఉంటుంది.

Official Website: https://ssc.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు