Modi Speech on operation Sindoor in telugu: రక్తం మరియు నీరు కలిసి ప్రవహించదు.
12 మే 2025 సోమవారం ప్రధాని మోదీ ఆపరేషన్ సింధుర్ గురించి జాతినీ ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది.
ప్రియమైన ప్రజలారా శుభాకాంక్షలు ఇటీవలి రోజుల్లో మన దేశం యొక్క బలం మరియు సంయవనం రెండింటిని మనం చూశాం. అన్నింటికంటే ముందు భారతదేశ సాహసోపేతమైన సాయుధ దళాలకు, మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు, మరియు ఈ దేశంలోని ప్రతి పౌరుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను.
ఆపరేషన్ సింధుర్ లక్ష్యాలను సాధించడంలో సైనికులు అపరిమితమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈరోజు నేను వారి వీరత్వాన్ని, వారి సాహసాన్ని, వారి ధైర్యాన్ని మనదేశంలోని ప్రతి తల్లికి, ప్రతి సోదరికి మరియు ప్రతి కుమార్తెకు అంకితం చేస్తున్నాను.
Modi Speech on operation Sindoor in telugu:
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం లో ఉగ్రవాదులు జరిపిన క్రూరత్వం దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసింది. అమాయక పర్యాటకులను, వారి కుటుంబాలు మరియు పిల్లల ముందు వారి విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ నిర్దాక్ష్యంగా చంపడం ఉగ్రవాదం యొక్క అత్యంత నీచమైన ముఖం. ఇది మన జాతీయ సామరస్యాన్ని నాశనం చేయడానికి వేసిన ప్రయత్నం. వ్యక్తిగత స్థాయిలో నేను ఆ బాధ ను లోతుగా అనుభవించాను. ఈ దాడి తరువాత మొత్తం దేశం, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి రాజకీయ పార్టీ ఉగ్రవాదంపై కఠిన చర్య కోసం ఏకమైంది.
ఉగ్రవాదమును అణచివేయడానికి మేము భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. నేడు ప్రతి ఉగ్రవాది మరియు ప్రతి ఉగ్రవాద సంస్థ మన సోదరీమణులు, కుమార్తెల నుదిటి నుండి సింధూర్ తొలగించడం అంటే ఏమిటో తెలుసు.
మిత్రులారా ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు కాదు, ఇది కోట్లాదిమంది భారతీయుల మనోభావాలను ప్రతిబింబిస్తుంది. ఇది న్యాయం యొక్క అవిచిన్నమైన ప్రతిజ్ఞ. మే 6వ తేదీ నుండి 7వ తేదీ ఉదయం వరకు ప్రపంచం ఆ ప్రతిజ్ఞను చర్యగా మార్చడాన్ని చూసింది. మన దళాలు పాకిస్థన్లోని ఉగ్రవాద శిబిరాలు మరియు శిక్షణ కేంద్రాలపై ఖచ్చితమైన దాడిని చేశాయి. భారతదేశం ఇంత నిర్ణయాత్మకమైన అడుగు వేస్తుంది అని ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేదు. దేశం ముందు అనే స్ఫూర్తితో ఒక దేశం ఐక్యమైనప్పుడు ఉక్కు లాంటి బలమైన నిర్ణయాలు తీసుకోబడతాయి మరియు అందుకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి.
భారతదేశ క్షిపణులు మరియు డ్రోనులు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు వాటి నిర్మాణాలు ధ్వంసం కావడమే కాకుండా వారి నైతిక స్థెర్యం కూడా దెబ్బతినింది. ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు అని తరచుగా పిలవబడే మహావల్పూర్ మరియు ముహిత్కే ప్రదేశాలు 9/11 నుండి లండన్ ట్యూబు బాంబుల దాడి వరకు మరియు భారతదేశంలో జరిగిన లెక్కలేనన్ని దాడుల వరకు ప్రతి ఉగ్రవాద దాడితో సంబంధాలు కలిగి ఉన్నాయి.
ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరంనీ తొలగించడానికి ధైర్యం చేయడంతో భారతదేశం ఈ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను తుడిచిపెట్టింది. ఈ దాడులలో వంద మందికి పైగా క్రూరమైన ఉగ్రవాదులు చంపబడ్డారు. దశాబ్దాలుగా భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ పాకిస్థాన్లో బహిరంగ తిరుగుతున్న అనేకమంది ఉగ్రవాద నాయకులు ఒకే దెబ్బతో హతమార్చబడ్డారు. భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ నిరాశ మరియు భయాందోళనలకు గురైంది. ఉగ్రవాదులకు అరికట్టే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే బదులు పాకిస్తాన్ స్వయంగా భారతదేశాన్ని లక్ష్యం చేసుకోవడం ప్రారంభించింది.
మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, దేవాలయాలు, పౌరుల గృహాలు, మరియు సైనిక స్థావరాల పైన దాడి చేయడం చేశారు. అయినప్పటికీ అలా చేయడం ద్వారా పాకిస్తాన్ తన సొంత బలహీనతను మాత్రమే బయట పెట్టింది. భారతదేశ ఆధునిక వైమానిక రక్షణ ముందు, పాకిస్తాన్ డ్రోనులు, క్షిపణులు గడ్డిల ఎలా విచ్ఛిన్నమయ్యాయో ప్రపంచం చూసింది. పాకిస్తాన్ మన సరిహద్దు పై దాడికి సిద్ధమయింది కానీ భారతదేశం పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది. మా డ్రోనులు మరియు క్షిపనులు ఖచ్చితమైన కచ్చితత్వంతో దాడి చేశాయి. పాకిస్తాన్ చాలాకాలంగా గొప్పగా చెప్పుకుంటున్న వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. మొదటి మూడు రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ అంచనాలకు మించి విధ్వంసం సృష్టించింది.
ప్రపంచ దేశాలు అన్ని ఇస్లామాబాద్ కి ఉద్రిక్తతను తగ్గించుకోవాలి అని పిలుపునిచ్చాయి. మే 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన DGMO నీ సంప్రదించింది. అప్పటికి మేము వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తీవ్రంగా నాశనం చేసేసాము. ఉగ్రవాదులను నిర్మూలించాము. వారి భూభాగం లోని ఉగ్రవాద శిబిరాలను శిథిలావస్థకు చేర్చాము. పాకిస్తాన్ మరింత ఉగ్రవాదం లేదా సైనిక పరంగా రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసింది. దాంతో భారతదేశం దానిని పరిగణలోనికి తీసుకోవడానికి అంగీకరించింది. నేను మళ్ళీ చెబుతున్నాను.. మేము పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మాత్రమే నిలిపేసాము. రాబోయే రోజుల్లో తీసుకుని ప్రతి అడుగు దాని ప్రవర్తనకు అనుగుణంగా ఉంటుంది.
Operation Sindoor 2025 in telugu: ఆపరేషన్ సింధుర్
మిత్రులారా భారత సైన్యం వైమానిక దళం నావికాదళం మరియు పారామీలటరి దళాలు బిఎస్ఎఫ్ తో సహా అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ దాడులు మరియు వైమానిక దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క విధానంగా మారింది. ఉగ్రవాదంపై పోరాడడంలో ఇది కొత్త రేఖను గీసుకుంది. మరియు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ముందుగా ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేస్తే మా నిబంధనాల ప్రకారం వారు వేగంగా మరియు అణచివేత ప్రతిస్పందనను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మేము దాడి చేస్తాం.
భారతదేశం ఎటువంటి అన్వాయుధ బెదిరింపులను కూడా సహించదు. దాని ముసుగులో ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో మరియు నిర్ణయాత్మకంగా ధ్వంసం చేస్తాం.
ప్రభుత్వంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మరియు ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకులకు మధ్య తేడాను మనం ఇక పై గుర్తించము. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ యొక్క అసహ్యకరమైన ముఖాన్ని ప్రపంచం చూసింది. పాకిస్తాన్ సీనియర్ అధికారులు హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు వీడ్కోలు పలికేందుకు వారి వద్దకు తరలి వెళ్లారు. ఇది రాష్ట్రప్రయోజిత ఉగ్రవాదనికి స్పష్టమైన రుజువు.
భారతదేశం మన పౌరులను ఏదైనా ముప్పునుండి రక్షించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది.
మిత్రులారా యుద్ధభూమీ లో మనం పాకిస్తాన్ ను పదేపదే అణచివేసాము మరియు ఆపరేషన్ సింధూరం ఒక కొత్త కోణాన్ని జోడించింది. మేము ఎడారులు మరియు పర్వతాలలో మా పరక్రమాన్ని ప్రదర్శించాము. మరియు కొత్త యుగయుద్ధంలో మా ఆధిపత్యాన్ని నిరూపించాము. మన భారతదేశంలో తయారు చేయబడిన ఆయుధాలు వాటి ప్రామాణికతను చూపించాయి. నేడు ప్రపంచం 21వ శతాబ్దపు యుద్ధంలో భారతదేశం తయారుచేసిన తక్షణ పరికరాలను చూసింది. భారతదేశం యొక్క రక్షణ పరికరాల సమయం ఆసన్నమైంది అని తెలుసుకుంది.
మిత్రులారా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ఐక్యత, మన గొప్ప బలం ఇది కచ్చితంగా యుద్ధ యుగం కాదు. కానీ ఇది ఉగ్రవాద యుగం కూడా కాదు. ఉగ్రవాదాన్ని సున్నాగా నిర్మూలించడమే మెరుగైన ప్రపంచానికి హామీ.
మిత్రులారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సైన్యం మరియు ప్రభుత్వం ఒకరోజు పాకిస్తాన్ ను నాశనం చేస్తాయి. పాకిస్తాన్ మనుగడ కోసం ప్రయత్నిస్తే అది తన ఉగ్రవాద మౌలిక సదుపాయాల ను తొలగించుకోవాలి. శాంతికి వేరే మార్గం లేదు. భారతదేశం యొక్క వైఖరి స్పష్టంగా ఉంది. మీరు ఉగ్రవాదం మరియు చర్చలు ఈ రెండింటిని ఒకేసారి కలిగి ఉండకూడదు. మీరు ఉగ్రవాదం మరియు వాణిజ్యాన్ని కలిగి ఉండకూడదు ఇంకా నీరు మరియు రక్తం కలిసి ప్రవహించవు. ఈరోజు బుద్ధ పూర్ణిమ. ఈరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేను ప్రపంచ సమాజానికి ఒక విషయం చెప్తాను. భారతదేశం పాకిస్తాన్ తో చేతులు కలిపితే కనుక అది కేవలం ఉగ్రవాదం పై మాత్రమే. ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే. వీటిపై మాత్రమే చర్చలు జరుపుతాం. వారితో చేయి కలుపుతాం.
ప్రియమైన తోటి పౌరులారా ఈరోజు గుద్ధ పౌర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపించాడు. అది కూడా బలం ద్వారానే ప్రయాణిస్తుంది. మానవాళి శాంతి మరియు శ్రేయస్సు వైపు ముందుకు సాగాలి అంటే భారతదేశం శక్తివంతంగా ఉండాలి మరియు అవసరమైనప్పుడు ఆ బలాన్ని ఉపయోగించాలి. ఇటీవలి రోజుల్లో భారతదేశం సరిగ్గా అదే చేసింది.
నేను మరోసారి భారత సైన్యానికి మరియు సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు స్ఫూర్తి కి మరియు ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. భారతమాతకు జై. భారతమాతకు జై. భారతమాతకు జై.

0 కామెంట్లు