పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు - Postal GDS Notification 2026

 Postal GDS Notification 2026

Postal GDS Notification 2026



పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ డాక్ సేవక్(GDS) ఫేస్ 2 నోటిఫికేషన్ విడుదల అయింది. 10వ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ Postal GDS Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ Postal GDS Recruitment 2026 ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్(BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ABPM)/డాక్ సేవక్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  ఈ Postal GDS Recruitment 2026 కోసం అభ్యర్థులు ఆగస్టు 31, 2026 వ తేదీ నుండి సెప్టెంబర్ 19, 2026 వ తేదీల మధ్య ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెప్టెంబర్ 2, 2026వ తేదీ నుండి సెప్టెంబర్ 21, 2026వ తేదీల మధ్య ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే సెప్టెంబర్ 23, 2026వ తేదీ నుండి సెప్టెంబర్ 24, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.

Age Limit:

  18 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లి హండికాప్డ్ అభ్యర్థుల లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



Educational Qualification:

  10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఏ రాష్ట్రానికి అయితే అభ్యర్థులు అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Selection Process:

మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

Application Fee:


ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:


BPM - Rs.12,000/- to Rs.29,380/-

ABPM/Dak Sevak - Rs.10,000/- to Rs.24,470/-

ప్రస్తుతం షార్టు నోటీసు మాత్రమే విడుదల అయింది. ఫుల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోస్టుల వివరాలు తెలియజేయడం జరుగుతుంది. 

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు