CSIR - NPL Recruitment 2026: టెక్నీషియన్ ఉద్యోగాలు

 CSIR - NPL Recruitment 2026: టెక్నీషియన్ ఉద్యోగాలు

CSIR - NPL Recruitment 2026


  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఫిజికల్ లాబరేటరీ, ఢిల్లీ నుండి టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CSIR - NPL Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

   ఈ CSIR - NPL Recruitment 2026 ద్వారా 

 ఎలక్ట్రానిక్స్ - 10 పోస్టులు 

 ఎలక్ట్రికల్ - 5 పోస్టులు 

 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 2 పోస్టులు 

 మల్టీమీడియా, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్ - 1 పోస్టు 

 డిజిటల్ ఫోటోగ్రాఫర్/ఫోటోగ్రాఫర్ - 1 పోస్టు 

 మెకానిక్ మోటార్ వెహికల్ - 1 పోస్టు 


  మొత్తంగా ఈ CSIR - NPL Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా 20 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


 ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 

Age Limit:

  ఈ CSIR - NPL Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి. 
 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


Selection Process:

  అప్లికేషన్స్ అన్నింటినీ పరిశీలించి అర్హులైన వారిని ట్రేడ్ టెస్ట్ కు పిలవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్టులో పాస్ అయిన వారిని రాత పరీక్షకు పిలవడం జరుగుతుంది. 

Written Examination:


పేపరు - 1: 
 మెంటల్ ఎబిలిటీ - 50 ప్రశ్నలు - 100 మార్కులు
ఇందులో తప్పు సమాధానానికి ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు.

పేపరు - 2
 జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 
 ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 
ఇందులో ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంది.

పేపరు - 3
  కన్సర్న్డ్ సబ్జెక్ట్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 150 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. 12th స్టాండర్డ్ లెవెల్లో పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. 

Educational Qualification:

  అభ్యర్థులు 55% మార్కులతో పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
అలాగే..
రిలవెంట్ ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి. 
లేదా 
రెండు సంవత్సరముల అప్రెంటిస్ చేసి ఉండాలి.
లేదా 
మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 

How To Apply:

  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం ను అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.nplindia.in లో డౌన్లోడ్ చేసుకోని ప్రింట్ తీయించుకోవాలి. అప్లికేషన్ ఫారం ను వారు అడిగిన విధంగా నింపాలి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత వారు తెలిపిన అడ్రస్ కు జూన్ 30, 2026వ తేదీ లోగా చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.

Application Fee:

 ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. 500 రూపాయలను డిడి (డిమాండు డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి.

Official Website: www.nplindia.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు