DSSC Notification 2026: పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 DSSC Notification 2026: పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

DSSC Notification 2026



  టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్డింగ్టన్ తమిళనాడు నుండి విడుదల అయింది. ఈ DSSC Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ DSSC Notification 2026 ద్వారా

లోవర్ డివిజన్ క్లర్క్ - 9 పోస్టులు 

సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 13 పోస్టులు 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 38 పోస్టులు 

డెమోగ్రాఫర్ గ్రేడ్ - II - 5 పోస్టులు

సూపర్వైజర్ - 1 పోస్టు 

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 4 పోస్టులు 

హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్ - 4 పోస్టులు 

లైన్ మాన్ - 2 పోస్టులు 

బోట్ బిల్డర్ - 1 పోస్టు 

టెక్నికల్ అటెండెంట్ - 1 పోస్టు 


  మొత్తంగా 78 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

ఈ DSSC Notification 2026 కోసం అభ్యర్థులు మే 23, 2026 వ తేదీ నుండి జూన్ 12, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 


బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 పోస్టులు

Age Limit:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్/టెక్నికల్ అటెండెంట్: ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.


  మిగిలిన పోస్టులకి 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్  రిలాక్సియేషన్ ఉంది. 

Educational Qualification:

లోవర్ డివిజన్ క్లర్క్: 12th క్లాసు పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి.

సివిలియన్ మోటార్ డ్రైవర్: 12th క్లాసు పాస్ అయి ఉండాలి. హెవీ వెహికల్స్ కి సంబంధించి సెవిలియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

టెనోగ్రాఫర్ గ్రేడ్ - 2: 12th పాసు అయి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.

సూపర్వైజర్: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజడ్ యూనివర్సిటీ ఆర్ ఇనిస్ట్యూట్. అలా అని రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 12th క్లాసు పాస్ అయి, నెట్వర్కింగ్ లో డిప్లమా చేసి ఉండాలి లేదా కంప్యూటర్ అప్లికేషన్లో బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి. సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలానే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 

హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్: 12th క్లాసు పాసై కంప్యూటర్ హార్డ్వేర్ లో డిప్లమా చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి  ఉండాలి.

లైన్మెన్: 12th క్లాసు పాస్ అయి ఉండాలి.  ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్ మేనేజ్మెంట్ లో డిప్లమా చేసి ఉండాలి. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి  ఉండాలి.

బోటు బిల్డర్: 12th క్లాసు పాసై ఉండాలి. అలానే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 

టెక్నికల్ అటెండెంట్: ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ లో ఐటిఐ పాసై ఉండాలి. లేదా పదవ తరగతి పాస్ అయ్యి, ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 

Selection Process:

రాత పరీక్ష మరియు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అప్లై కి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.


Official Website: https://ids.nic.in/index

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు