KVS & NVS Recruitment 2025 in telugu: టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు
కేంద్రీయ విద్యాలయ సాగతన్(KVS) మరియు నవోదయ విద్యాలయ సమితి (NVS) లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ KVS & NVS Recruitment 2025 ద్వారా 14967 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ KVS & NVS Recruitment 2025 in telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply పూర్తి వివరాలను చూద్దాం.
ఈ KVS & NVS Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs), లైబ్రరీయన్, ప్రైమరీ టీచర్స్(PRTs) మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ KVS & NVS Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 14, 2025వ తేదీ నుండి డిసెంబర్ 4, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
18 సంవత్సరముల నుండి 27, 30, 35, 40, 45, 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల రిలాక్సేషన్ ఉంది.
PGTs, TGTs posts, Librarian and PRTs పోస్టులకు అప్లై చేసుకునే మహిళా అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 12వ తరగతి పాసై, టైపింగ్ వచ్చిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ల్యాబ్ అటెండెంట్: సైన్స్ స్ట్రీమ్ లో 12th పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా పదవ తరగతి పాసై సర్టిఫికెట్ కలిగి ఉండాలి/డిప్లమా ఇన్ లాబరేటరీ టెక్నిక్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -II: గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీషులో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.
మిగతా పోస్టులకి పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. డిప్లమా, డిగ్రీ, బి.ఎడ్., పీజీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మీ క్వాలిఫికేషన్ ను బట్టి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోండి.
Selection Process:
కొన్ని పోస్టులకి రిటర్న్ ఎగ్జామినేషన్స్ నీ నిర్వహించి భర్తీ చేస్తున్నారు. మరి కొన్ని పోస్టులనీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి భర్తీ చేస్తూ ఉన్నారు, మరికొన్ని పోస్టులనీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మరియు ఇంటర్వ్యూ ను నిర్వహించి భర్తీ చేస్తూ ఉన్నారు.
Application Fee:
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 2300 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు మరియు 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు 1500 రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలను చెల్లించాలి.
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండన్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు 1200 రూపాయలను మరియు ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలను చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Notification PDF: Click Here
Official Website: https://kvsangathan.nic.in/ https://navodaya.gov.in/
.png)
0 కామెంట్‌లు