AP Anganwadi Recruitment 2025: 4687 అంగన్వాడి ఉద్యోగాలు
AP Anganwadi Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,687 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ AP Anganwadi Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.
సెప్టెంబర్ 12, 2025వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 4,687 అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి జీవో విడుదల అయింది. ఈ జీవో ద్వారా మినీ అంగన్వాడీ సెంటర్స్ ను మెయిన్ అంగన్వాడి సెంటర్స్ గా మార్చారు.
త్వరలోనే AP Anganwadi Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల అవనుంది. అయితే రాష్ట్రంలో ఉన్న 4,687 ఖాళీలను ఒకేసారి భర్తీ చేయరు. జిల్లాల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
ఒక్కో జిల్లాకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. మీ జిల్లాకు నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు, మీరు అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age Limit:
ఈ AP Anganwadi Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
Educational Qualification:
పదవ తరగతి పాస్ అయి ఉంటే అభ్యర్థులు ఈ AP Anganwadi Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం జరగదు.
మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. లేదంటే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
Imp Documents
* డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్.
* కుల ధ్రువీకరణ పత్రం
* విద్యార్హత ధ్రువీకరణ పత్రం
* నివాస స్థల ధ్రువీకరణ పత్రం
* వితంతువు అయివుంటే బర్త డేత్ సర్టిఫికెట్ (ఆవిడకు 18 సంవత్సరముల పిల్లలు ఉన్నచో పిల్లల డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్.)
* వికలాంగులు అయి ఉంటే ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికేట్.
* ఆధార్ కార్డు
* రేషన్ కార్డు.
How To Apply:
ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం(అంగన్వాడి పోస్టు కొరకు దరఖాస్తు) తీసుకొని పూర్తిగా నింపాలి. అప్లికేషన్ ఫారం తో పాటు పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ ని జత చేసి సంబంధిత సిడిపిఓ కార్యాలయములో అందజేయవలెను.
అయితే ఇప్పుడు 4,687 పోస్టులను భర్తీ చేయుటకు జీవో మాత్రమే విడుదల అయింది. ఇంకా నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు. జిల్లాల వారీగా ఒక్కో నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. నోటిఫికేషన్లు విడుదల అయిన తర్వాత జిల్లా ప్రకారం పైన తెలిపిన వివరాలు కొన్ని మారవచ్చు.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు తెలియాలి అంటే మన
telugunetcentre.site వెబ్ సైట్ ను డైలీ సందడించండి.
0 కామెంట్లు