NSCD Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలు.
నేషనల్ సైన్స్ సెంటర్, ఢిల్లీ(NSCD) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NSC అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూసియమ్స్(NCSM) కింద పనిచేస్తోంది. ఈ NSCD Recruitment 2025 ద్వారా 24 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ NSCD Recruitment 2025 ద్వారా
టెక్నీషియన్ - ఏ - 18 ఉద్యోగాలను(Fitter-7, కార్పెంటర్ -3, ఎలక్ట్రానిక్స్ -3, పెయింటర్ -2, కంప్యూటర్ H /W &నెట్వర్కింగ్ -1, డ్రాఫ్ట్స్మన్ -2)
ఆర్టిస్ట్ -A - 3(UR -1, OBC -1, EWS -1)
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -A - 01(ST)పోస్టు
టెక్నికల్ అసిస్టెంట్ -A -01 (UR)(ఎలక్ట్రికల్)
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ -A - 1 (EWS)పోస్టును భర్తీ చేస్తున్నారు.
ఈ NSCD Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 30, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
టెక్నీషియన్-A:
పదవ తరగతి చదివి రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
2 సంవత్సరంల ఐటిఐ చేసిన వారు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 1 సంవత్సరం ఐటిఐ చేసిన వారు 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
ఆర్టిస్ట్-A:
ఫైన్/కమర్షియల్ ఆర్ట్ లో డిప్లొమా/సర్టిఫికేషన్ కోర్సు చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
2 సంవత్సరముల డిప్లమా చేసిన వారు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 1 సంవత్సరం డిప్లమా చేసిన వారు 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -A:
బ్యాచిలర్స్ డిగ్రీని సైన్స్ లో చేసి ఉండాలి. ఫిజిక్ తో పాటు క్రింది ఏదైనా రెండు సబ్జెక్టుల్లో చదివి ఉండాలి.
కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రోనామీ, జువాలజీ అండ్ స్టాటస్టిక్స్.
లేదా
బ్యాచిలర్స్ డిగ్రీని సైన్సులో కెమిస్ట్రీ తో పాటు క్రింది రెండు సబ్జెక్టుల్లో చదివి ఉండాలి.
జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయో టెక్నాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ.
టెక్నికల్ అసిస్టెంట్-A:
ఎలక్ట్రికల్ లో 3 సంవత్సరముల డిప్లమా కోర్సు చేసి ఉండాలి.
ఎగ్జిబిషన్ అసిస్టెంట్-A:
విజువల్ ఆర్ట్స్/ఫైన్ ఆర్ట్స్/కమర్షియల్ ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 885 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి ఈచ్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
మహిళలు, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఆగస్టు 30, 2025వ తేదీలోపు ఫీజును చెల్లించాలి.
Salary:
టెక్నీషియన్-A: Rs.19,900-63,200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు Rs.34,230 రూపాయలు రావడం జరుగుతుంది.
ఆర్టిస్ట్-A: Rs.19,900-63,200 రూపాయల మధ్య జీతం రావడం జరుగుతుంది. అన్ని కలుపుకొని అప్రాక్సీమేట్ గా Rs.38,908 జీతం రావడం జరుగుతుంది.
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -A: Rs.29,200-92,300 మధ్య జీతం రావడం జరుగుతుంది. అన్ని కలుపుకొని అప్రాక్సీమేట్లీగా 59,600 రూపాయల జీతం ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్-A: 29,200-92,300 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని అప్రాక్సీమేట్లీగా 56,680 రూపాయల జీతం వస్తుంది.
ఎగ్జిబిషన్ అసిస్టెంట్-A: 29,200-92,300 రూపాయల మధ్య జీతం వస్తుంది. అన్ని కలుపుకొని అప్రాక్సీమేట్లీగా నెలకు 59,600 రూపాయల జీతం రావడం జరుగుతుంది.
Official Website: https://nscd.gov.in/career/
0 కామెంట్‌లు