AP Koushalam Work From Home Jobs: ఆంధ్రప్రదేశ్ కౌశలం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.

AP Koushalam Work From Home Jobs: ఆంధ్రప్రదేశ్ కౌశలం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు. 

AP Koushalam Work From Home Jobs: ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.



AP Koushalam Work From Home Jobs:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కౌశలం అనే పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ AP Koushalam Work From Home Jobs ద్వారా ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారికి ఇంటి నుంచి పని చేసే విధంగా పని కల్పించనున్నారు. ఈ AP Koushalam(కౌశలం)
 Work From Home Jobs కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ Koushalam అనే పథకం పేరుతో ఇంటి నుంచి పని చేసే విధంగా ఉద్యోగాలను కల్పించనున్నారు.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అంటే ఇప్పటినుండి 3 నెలల క్రిందట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటి వద్దకు వచ్చి డేటాను సేకరించడం జరిగింది. అప్పుడు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ చూపిన నిరుద్యోగులకు ఇప్పుడు సచివాలయంలో వారి పేర్లు రావడం జరిగింది.

   అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ సర్వే నిర్వహిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.

  ఈ AP Koushalam Work From Home Jobs ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2025 వ తేదీలోపు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి.


AP Koushalam Age Limit:


  18 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు అందరూ ఈ AP Koushalam Work From Home Jobs ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.


AP Koushalam Educational Qualification:


  పదవ తరగతి కి తక్కువ
  పదవ తరగతి
  ఇంటర్ 
  ఐటిఐ 
  డిప్లమా 
  గ్రాడ్యుయేట్ 
  పోస్టు గ్రాడ్యుయేట్ డప్లమా
  పోస్టు గ్రాడ్యుయేట్(PG)
  పీహెచ్డీ

  ఏదైనా సరే చదువుకున్న అభ్యర్థులు ఈ AP Koushalam Work From Home Jobs ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
  

Selection Process For AP Koushalam:


  AP Koushalam Work From Home Jobs కి సంబంధించి సెలక్షన్ ఎలా చేస్తారు అనేది ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు కేవలం సర్వే నిర్వహిస్తున్నారు. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేయడం జరుగుతుంది.

How To Apply For AP Koushalam:


  ఈ AP Koushalam Work From Home Jobs ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఆ క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు మరియు ఆధార్కు లింకు అయిన మొబైల్ నంబర్ ను మీకు చెందిన గ్రామ వార్డు సచివాలయానికి తీసుకొని వెళ్ళండి.

  ఆధార్కు లింకు అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది.

AP Koushalam Survey Questions:


  అప్లై చేసుకోవడానికి వెళ్ళిన అభ్యర్థులకు ఈ క్రింది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 

  • అభ్యర్థికి ఎన్ని భాషలు వచ్చు?
  • విద్యార్హత ఏమిటి?
  • విద్యార్హత స్పెషలైజేషన్ 
  • క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులు 
  • ఏ సంవత్సరంలో పాసయ్యారు 
  • ఒరిజినల్ సర్టిఫికెట్ ని అడగడం జరుగుతుంది. (ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు.)
  • ఎక్కడ చదువుకున్నారో అడగడం జరుగుతుంది. 
  • ఇంకా ఏమైనా అదనంగా క్వాలిఫికేషన్ ఉంటే అడగడం జరుగుతుంది.

AP Koushalam Salary:


  ఈ AP Koushalam Work From Home Jobs కి సంబంధించి జీతం వివరాలు వెల్లడించలేదు. సమాచారం మేరకు క్వాలిఫికేషన్ బట్టి, వచ్చే జాబును బట్టి జీతం ఉంటుంది. 


ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు తెలియాలి అంటే మన telugunetcentre.site వెబ్ సైట్ ను డైలీ సందడించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు