BSF Constable Tradesmen Recruitment 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.
BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. BSF Constable Tradesmen Recruitment 2025 ద్వారా 3588 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు అందరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా పురుషులకి 3406 ఉద్యోగాలను, మహిళలకు 182 ఉద్యోగాలను మొత్తంగా 3588 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (కొబ్లార్, టైలర్, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, కుక్, వాటర్ కారియర్, వాషర్ మెన్, బార్బర్, స్వీపర్, వైటర్, పంప్ ఆపరేటర్, అప్హోల్స్టార్, ఖోజీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు పోస్టుల వివరాలు కోసం అఫిషియల్ నోటిఫికేషన్ లో చూస్కోండి.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 25 జులై 2025వ తేదీ నుండి 23 ఆగస్టు 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
1) కానిస్టేబుల్ (ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అప్హోల్స్టార్) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు
పదవ తరగతి పాసై ఉండాలి.
సంబంధిత ట్రేడ్ లో రెండు సంవత్సరముల ఐటిఐ కోర్సు చేసి ఉండాలి.
లేదా
సంబంధిత ట్రేడ్లో ఒక సంవత్సరం ఐటిఐ కోర్టు చేసి, ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
2) కానిస్టేబుల్ (కోబ్లర్, టైలర్, వాషర్ మెన్, బార్బర్, స్వీపర్, ఖోజీ) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు
పదవ తరగతి పాసై ఉండాలి.
సంబంధిత ట్రేడ్ కి సంబంధించి ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.
3) కానిస్టేబుల్ (కుక్, వాటర్ కారియర్, వెయిటర్) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు
పదవ తరగతి పాసై ఉండాలి.
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ లో నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ (NSQF) లెవెల్-1 కోర్సు చేసి ఉండాలి.
Physical Standards:
Height:
MALE: 165 CM
FEMALE: 155 CM
Chest:
MALE: 75-80 CM
ఎస్టీ అభ్యర్థులకు రిలాక్సేషన్ ఉంది.
Application Fee:
అభ్యర్థులు ఈ ఉద్యోగులకు అప్లై చేయాలి అంటే 100 రూపాయలను అప్లికేషన్ ఫీజ్ కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Salary:
ఈ ఉద్యోగాలు లెవెల్-3 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల మధ్య సాలరీ రావడం జరుగుతుంది. అలాగే అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Official Website: Https://rectt.bsf.gov.in
0 కామెంట్‌లు