Yuvatha Poru: వైఎస్ఆర్సిపి “యువత పోరు” నిరసనలు.
Yuvatha Poru పేరుతో YSRCP ప్రభుత్వం కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి కలెక్టరేట్ల ముందర “యువత పోరు” పేరుతో జూన్ 23, 2025 వ తేదీన నిరసనలు చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ప్రతినెలా 3000 రూపాయలను నిరుద్యోగ భృతి కింద అందిస్తామనీ హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు.
నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, అలానే ప్రకటించిన విధంగా నెలకు నిరుద్యోగులకు 3000 రూపాయలను అందించాలని వైసీపీ ప్రభుత్వం జూన్ 23, 2025 వ తేదీన యువత పోరు పేరుతో కలెక్టరేట్ల ముందర నిరసన తెలుపనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందించనున్నారు.
2025 - 2026 సంవత్సరానికి గాను నిరుద్యోగ భృతి కింద బడ్జెట్ ను కేటాయించలేదు. చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ జూన్ 23 న కలెక్టరేట్ల ముందర వైఎస్ఆర్సిపి పార్టీ నిరసనలు తెలపనుంది. బడ్జెట్లో పైసా కూడా నిరుద్యోగ భృతికి కేటాయించలేదు అని వైఎస్ఆర్సిపి పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది.
0 కామెంట్‌లు