SBI PO Recruitment 2025 in telugu: ఎస్బిఐ పీఓ 541 ఉద్యోగాలు
భారతదేశంలో ప్రముఖ బ్యాంక్ అయినటువంటి SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుండి PO(ప్రొబేషనరీ ఆఫీసర్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI PO Recruitment 2025 ద్వారా 541 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 541 SBI PO ఉద్యోగాలలో 500 ఉద్యోగాలు రెగ్యులర్ వేకెన్సీస్ కింద, 41 ఉద్యోగాలను బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల కు కూడా వేకెన్సీస్ ని కేటాయించడం జరిగింది.
ఈ SBI PO Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 24, 2025వ తేదీ నుండి జులై 14, 2025 వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి లో అప్లై చేసుకోవాలి. ఈ ఈ SBI PO Recruitment 2025 కి సంబంధించి ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 14, 2025.
Age Limit For SBI PO Recruitment 2025 in telugu:
ఈ SBI PO Recruitment 2025 కోసం అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఏప్రిల్ 01, 2025 వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అను రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరంలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification For SBI PO Recruitment 2025 in telugu:
ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ SBI PO Recruitment 2025 ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సెప్టెంబర్ 30, 2025వ తేదీ నాటికి పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఉండాలి.
Selection Process For SBI PO Recruitment 2025 in telugu:
ఈ SBI PO Recruitment 2025 ఉద్యోగాలను త్రీ ఫేసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
1) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
2) మెయిన్ ఎగ్జామినేషన్
3) సైకో మెట్రిక్ టెస్ట్, గ్రూపు ఎక్ససైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఎస్బిఐ పిఓ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
1) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 40 ప్రశ్నలు - 20 నిమిషాలు
క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు - 20 నిమిషాలు
రీజనింగ్ అబిలిటీ - 30 ప్ర శ్నలు - 20 నిమిషాలు
మొత్తంగా 100 ప్రశ్నలకు గాను 100 మార్కుల చొప్పున ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. పైన తెలిపిన విధంగా ప్రతి సెక్షన్కు సపరేట్గా టైమింగ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించి కాల్ లెటర్లను జులై మూడవ లేదా నాలుగో వారంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ SBI PO Recruitment 2025 Preliminary Exam ను జూలై/ఆగస్టు 2025లో నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు/సెప్టెంబర్ 2025లో ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది.
2) మెయిన్ ఎగ్జామినేషన్
ప్రిలిమినరీ ఎగ్జామ్ లో రాసిన అభ్యర్థులను 1:10 రేషియోలో మెయిన్స్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
మెయిన్స్ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో 170 ప్రశ్నలకు 200 మార్కులకు గాను మూడు గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది. డిస్క్రిప్టివ్ పేపర్ ను 50 మార్కులకు గాను 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ SBI PO Recruitment 2025 Mains Exam కి సంబంధించి కాల్ లెటర్లను ఆగస్టు/సెప్టెంబర్ 2025లో విడుదల చేయడం జరుగుతుంది. మెన్స్ ఎగ్జామ్ ను సెప్టెంబర్, 2025 లో నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్/అక్టోబర్ 2025 లో మెయిన్స్ ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది.
తర్వాత ఫేస్-3 నీ నీర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫేస్-3 కి సంబంధించి కాల్ లెటర్ల ను అక్టోబర్/నవంబర్ లో విడుదల చేయడం జరుగుతుంది.
Application Fee For SBI PO Recruitment 2025 in telugu:
ఈ SBI PO Recruitment 2025 in telugu ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండికాప్టర్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Examination Centers For SBI PO Recruitment 2025 in telugu:
ఆంధ్ర ప్రదేశ్ లో:
ప్రిలిమినరి: ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
మెయిన్స్: గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.
తెలంగాణలో:
ప్రిలిమినరీ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్: హైదరాబాదు, ఖమ్మం.
Official Website: https://bank.sbi/
0 కామెంట్‌లు