SBI Recruitment 2025 in telugu: 18,000 పోస్టులతో త్వరలో ఎస్బిఐ నోటిఫికేషన్
State Bank of India (SBI) నుండి త్వరలో 18,000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఎస్బిఐ సంస్థ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు. State Bank of India (SBI) నుండి త్వరలో 2025 - 2026 సంవత్సరానికి సంబంధించి క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్), ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లు విడుదల కానున్నాయి.
ఈ State Bank of India (SBI) లో 2025 - 2026 జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలో
క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) - 13,400 ఉద్యోగాలు,
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) - 3000 ఉద్యోగాలు,
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) - 1600 ఉద్యోగాలు
భర్తీ చేయనున్నారు.
Bank of Baroda లో పదవ తరగతి అర్హతతో 500 ప్యూన్ ఉద్యోగాలు.
SBI Clerk (Junior Associates) Recruitment 2025 in telugu:
ఈ సంవత్సరం SBI Clerk Recruitment 2025 ద్వారా 13,400 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఏదైనా సరే యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఎస్బిఐ క్లర్కు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ SBI Clerk Recruitment 2025 కు అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.
ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారు ఇచ్చిన డేట్ లోపల http://sbi.co.in/ వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఎగ్జాం అనేది తెలుగులో కూడా ఉంటుంది. పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలోనే వస్తుంది. ఈ క్లర్కు ఉద్యోగుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మంచిగా రాసిన అభ్యర్థులను మెయిన్స్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ లో మంచిగా పెర్ఫార్మ్ చేసిన అభ్యర్థులకు
ఈ క్లర్కు ఉద్యోగాలను కేటాయించడం జరుగుతుంది.
ఈ SBI Clerk Recruitment 2025 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ప్రతి నెల అప్రాక్సిమెట్లీగా Rs 46,000 సాలరీ రావడం జరుగుతుంది.
SBI Probationary Officers (PO) Recruitment 2025 in telugu:
ఈ 2025 - 2026 ఎస్బిఐ క్యాలెండర్ ద్వారా SBI Probationary Officers (PO) Recruitment 2025 ద్వారా 3000 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ SBI Probationary Officers (PO) Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరములు ఓబీసీకి 3 సంవత్సరములు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.sbi.co.in లోకి వెళ్లి మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటది. ప్రిలిమినరీలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధిస్తారు.తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ లో మంచిగా రాసిన అభ్యర్థులు చివరిగా ఇంటర్వ్యూ అర్హత సాధిస్తారు. ఇంటర్వ్యూను ఈ SBI Probationary Officers (PO) Recruitment 2025 పోస్టుల భర్తీ కై చివరిగా నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మంచిగా పెర్ఫార్మ్ చేసిన అభ్యర్థులకు ఈ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగం అలాట్ చేయడం జరుగుతుంది.
SBI Specialist Officers (SO) Recruitment 2025 in telugu:
SBI సంస్థలో 2025 - 2026 సంవత్సరానికి సంబంధించి 1600 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Specialist Officers (SO) Recruitment 2025 త్వరలో విడుదల కానుంది.
పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ను కూడా అడగడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ నీ కూడా పోస్టును బట్టి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.
గతంలో వచ్చిన నోటిఫికేషన్లను చూసుకొని ఈ ఎస్బిఐ ఎస్ఓ రిక్రూట్మెంట్ ను అర్థం చేసుకోండి.
ఎవరికైనా బ్యాంకు ఉద్యోగాలు చేయాలి అని ఉంటే, కచ్చితంగా ఇప్పటినుండి ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ జాబ్ కి సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ పాటర్న్ ఎలా ఉంటుంది, అనే విషయాలు అన్నీ తెలుసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి.
అన్ని ఉద్యోగాల కన్నా ఈ బ్యాంకు ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐబీపీఎస్ నోటిఫికేషన్ కూడా ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ ఐబీపీఎస్ నోటిఫికేషన్ ద్వారా కూడా క్లర్కు, పిఓ మరియు ఎస్ ఓ ఉద్యోగాలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇప్పటినుండి ప్రిపేర్ అవ్వండి.
Official Website: http://sbi.co.in/
0 కామెంట్‌లు