Ad Code

Responsive Advertisement

AP Library Recruitment 2025 in telugu: 976 పోస్టులతో లైబ్రరీలో ఉద్యోగాల భర్తీ.

 AP Library Recruitment 2025 in telugu: 976 పోస్టులతో లైబ్రరీలో ఉద్యోగాల భర్తీ.


AP Library Recruitment 2025 in telugu: 976 పోస్టులతో లైబ్రరీలో ఉద్యోగాల భర్తీ.



  AP Library Recruitment 2025 in telugu: గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుండి 976 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 

  పబ్లిక్ లైబ్రరీస్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఒక లెటర్ పాస్ చేయడం జరిగింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థల్లో వాటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయ సంస్థల్లో లైబ్రరీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 ఈ AP Library Recruitment 2025 in telugu ద్వారా 

  1) లైబ్రేరియన్ గ్రేడ్ 2: 92 పోస్టులను 
  2) లైబ్రేరియన్ గ్రేడ్ 3: 224 పోస్టులను 
  3) రికార్డ్ అసిస్టెంట్: 111 పోస్టులను 
  4) ఆఫీసు సబార్డినేట్స్: 421 పోస్టులను 
  5) వాచ్ మెన్సు: 128 పోస్టులను 
మొత్తంగా ఈ AP Library Recruitment 2025 in telugu: రిక్రూట్మెంట్ ద్వారా 976 పోస్టులను  భర్తీ చేస్తున్నారు.

  ఈ 976 ఖాళీలు అనేవి రిటైర్మెంట్లు, రాజీనామాలు, ప్రమోషన్స్, ఇతర కారణాల ద్వారా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

  ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా గ్రంథలయాల్లో మనుషుల కొరత చాలా ఏర్పడింది. గ్రంధాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి చాలా ఎక్కువైంది. కొన్ని గ్రంథాలయాల్లో ఉద్యోగులు లేక మూసి వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని లెటర్ పాస్ చేయడం జరిగింది. 
  ఈ 976 పోస్టులను భర్తీ చేసినట్లయితే క్లోజ్ అయిన లైబ్రరీస్ మళ్లీ తిరగడం జరుగుతుంది. మిగిలిన గ్రంథాలయాలు సక్రమంగా సాగడం జరుగుతుంది.


Educational Qualification: 


లైబ్రేరియన్ గ్రేడ్ 2, లైబ్రేరియన్ గ్రేడ్ 3:  ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే సపరేట్గా లైబ్రరీ సైన్స్ చదివి ఉండాలి.

రికార్డ్ అసిస్టెంట్:  ఇంటర్ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు ఈ రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఆఫీసు సబార్డినేట్స్: ఈ ఆఫీస్ సబార్డినేటర్ ఉద్యోగాలకి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వాచ్ మెన్సు: ఏడవ తరగతి క్వాలిఫికేషన్ తో వాచ్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

District wise AP Library Vacancies: 


  శ్రీకాకుళం: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 14 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 05 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 17 పోస్టులు, వాచ్ మెన్సు: 05 పోస్టులు. 

  విజయనగరం: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 09 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 04 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 13 పోస్టులు, వాచ్ మెన్సు: 00 పోస్టులు. 

  విశాఖపట్నం:  లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 19 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 06 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 32 పోస్టులు, వాచ్ మెన్సు: 00 పోస్టులు. 

  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి లైబ్రేరియన్ గ్రేడ్ 2 - 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  వెస్ట్ గోదావరి: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 15 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 11 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 37 పోస్టులు, వాచ్ మెన్సు: 04 పోస్టులు. 

  ఈస్ట్ గోదావరి: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 24 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 28 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 73 పోస్టులు, వాచ్ మెన్సు: 02 పోస్టులు. 

  కృష్ణ: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 28 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 16 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 62 పోస్టులు, వాచ్ మెన్సు: 49 పోస్టులు. 

  వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ మూడు జిల్లాలకు కలిపి లైబ్రేరియన్ గ్రేడ్ 2 - 27 పోస్టులను భర్తీ చేస్తున్నాను. 

  గుంటూరు: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 17 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 00 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 34 పోస్టులు, వాచ్ మెన్సు: 23 పోస్టులు. 

  ప్రకాశం: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 18 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 20 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 14 పోస్టులు, వాచ్ మెన్సు: 08 పోస్టులు. 

  నెల్లూరు: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 18 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 04 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 26 పోస్టులు, వాచ్ మెన్సు: 02 పోస్టులు. 

  గుంటూరు ప్రకాశం నెల్లూరు కలిపి లైబ్రేరియన్ గ్రేడు 2 - 18 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  కర్నూలు: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 12 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 05 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 32 పోస్టులు, వాచ్ మెన్సు: 00 పోస్టులు. 

  కడప: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 17 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 02 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 24 పోస్టులు, వాచ్ మెన్సు: 17 పోస్టులు. 

  అనంతపురం: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 08 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 06 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 21 పోస్టులు, వాచ్ మెన్సు: 12 పోస్టులు. 

  చిత్తూరు: లైబ్రేరియన్ గ్రేడ్ 3 - 18 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 01 పోస్టులు, ఆఫీసు సబార్డినేట్స్ - 28 పోస్టులు, వాచ్ మెన్సు: 02 పోస్టులు. 

  కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు నాలుగు జిల్లాలకు కలిపి లైబ్రరీ గ్రేడు-02 - 28 పోస్టులు ఉన్నాయి.

  జిల్లాల వారీగా మరియు రీజినల్ వారీగా పోస్టులు 945 ఉన్నాయి. 

  గవర్నమెంట్ రీజనల్ లైబ్రరీస్ అయినటువంటి విశాఖపట్నం, రాజమండ్రి,  గుంటూరు, తిరుపతిలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు