UPSC Civil Services 2024 Toppers In Telugu: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, వారి మాటలు.
UPSC Civil Services 2024 Toppers In Telugu: యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి civil services exam 2024 Results విడుదలయ్యాయి. ఈ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఎలాగైనా పాస్ అవ్వాలి అని చాలామంది యువత కోరిక. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్), IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్), IFS (ఇండియన్ ఫారిన్ సర్వీస్) లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ తో పాటు ఇండియాలోని గ్రూప్ ఏ మరియు గ్రూపు బి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 ఫలితాలు లు ఏప్రిల్ 22 మంగళవారం విడుదలయ్యాయి.
యూపీఎస్సీ బోర్డు 1056 పోస్టులతో 2024లో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యూపీఎస్సీ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో 1009 మంది అభ్యర్థులను ఈ సివిల్ సర్వీసెస్ కి ఎంపిక చేయడం జరిగింది.
ఈ యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2024లో విడుదల అయింది. అప్లై చేసుకున్న వారికి జూన్ 16, 2024 వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూలై 01, 2024 వ తేదీన రిలీజ్ అయ్యాయి. లక్షల మంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరవగా. కేవలం 14,627 అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించడం జరిగింది.
ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జాములు సెప్టెంబర్ 20, 2024 వ తేదీ నుండి సెప్టెంబర్ 29, 2024 వ తేదీ వరకు జరిగాయి. ఈ యుపిఎస్సి మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 09, 2024వ తేదీన విడుదల కావడం జరిగింది. అయితే ఈ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ ను 2,845 మంది క్లియర్ చేయగలిగారు. ఈ 2,845 అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
ఈ UPSC Civil Services Exams ఇంటర్వ్యూలు జనవరి 07, 2025 వ తేదీ నుండి ఏప్రిల్ 17, 2025 వ తేదీ వరకు జరిగాయి. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థుల యొక్క ఫైనల్ రిజల్ట్ ను ఏప్రిల్ 22 2025 వ తేదీ మంగళవారం విడుదల చేయడం జరిగింది. టోటల్గా 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ద్వారా 1009 మంది అభ్యర్థులు ఎంపిక అయినట్లు, అభ్యర్థుల పేరు మరియు రోల్ నంబర్ తో పిడిఎఫ్ విడుదల చేసింది.
ఈ 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR -1) మొదటి స్థానం శక్తి ధూబే దక్కించుకుంది. ఆల్ ఇండియా ర్యాంకు (AIR -2) రెండవ స్థానం హర్షిత గోయల్ మరియు ఆల్ ఇండియా ర్యాంకు (AIR-3) మూడవ స్థానం డోంగ్రే ఆర్చిత్ పరాగ్ దక్కించుకున్నారు. అలాగే AIR-4: షా మర్జీ చిరాగ్, AIR-5: ఆకాశ్ గార్గ్, AIR-6: కోమల్ పూనియా, AIR-7: ఆయుషి బన్సాల్, AIR-8: రాజ్ కృష్ణ జా, AIR-9: ఆదిత్య విక్రం అగర్వాల్, AIR-10: మయంక్ త్రిపాటి మొదటి 10 స్థానాల్లో నిలిచారు.
TGSRTC Recruitment 2025 in telugu
UPSC Civil Services Toppers In Telugu:
అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈటబోయిన సాయి శివాని కి AIR -11 వచ్చింది. బన్నా వెంకటేష్ కు AIR-15 వ ర్యాంకు వచ్చింది. అభిషేక్ శర్మకు AIR-38వ ర్యాంకు వచ్చింది. రావుల జయసింహారెడ్డికి AIR-46 ర్యాంకు వచ్చింది. శ్రావణ్ కుమార్ రెడ్డికి AIR-62 వ ర్యాంకు వచ్చింది. సాయి చైతన్య జాదవ్ కు AIR-68 వ ర్యాంకు వచ్చింది. చేతన రెడ్డికి AIR- 110 వ ర్యాంకు వచ్చింది. చెన్నం రెడ్డి శివ గణేష్ రెడ్డికి AIR - 119 వ ర్యాంకు వచ్చింది.
UPSC Civil Services Topper Ettaboyina Sai Shivani (AIR -11) in telugu
ఈటబోయిన సాయి శివాని AIR -11 మాట్లాడుతూ.. ఇంత మంచి ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది, అందులో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రావడం చాలా సంతోషం అని తెలియజేశారు. నేను చాలా కష్టపడ్డాను అయితే ఇంత మంచి ర్యాంకు వస్తుంది అని అనుకోలేదు, ఇంత మంచి ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు.
నాకు చిన్నప్పటినుండి ఐఏఎస్ అవ్వాలి అని డ్రీమ్ ఉండేది. కాలేజ్ అయిపోంగానే ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ క్లియర్ అవలేదు. ఆ టైంలో ఫ్యామిలీ మరియు ఫ్రెండ్షిప్ సపోర్ట్ వల్ల ధైర్యం తెచ్చుకొని సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. ఎన్నో ఏల్ల కల ఈరోజు నెరవేరింది. నేను ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయినప్పుడు ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి అని గుర్తించాను. కన్సిస్టెన్సీగా చదివి ప్రాక్టీస్ చేసి మరియు కొందరి గైడెన్స్ తో నా వీక్ ఏరియాస్ ని స్ట్రెంత్ గా మార్చుకున్నాను. నా స్కూలింగ్ మొత్తం ఖమ్మంలో చదువుకున్నాను. తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీ ఒంగోలులో చదువుకున్నాను. ఇక్కడ ఇంటర్ తో పాటు ఇంజనీరింగ్ మొత్తం 6 సంవత్సరాలు చదువుకున్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మనకు ఏదైనా సరే స్ట్రాంగ్ విజన్ ఉంటే కచ్చితంగా చేయగలుగుతాము. ఫస్ట్ నువ్వు నీకు ఏదైనా కావాలి అనుకుంటే నీవు ఏం సాక్రి ఫై చేయగలుగుతావు మరియు దానికోసం ఎంత దూరం వెళ్లగలుగుతావు అనే క్లారిటీ మీకు ఉండాలి. మీరు పెట్టుకున్న గోల్ పై మీకు ఎంత క్లారిటీ ఉంటే అంతా సక్సెస్ అవ్వడానికి వీలు ఎక్కువ ఉంటుంది.
న్యూస్ అనేది సివిల్ సర్వీసెస్ కి చాలా ఇంపార్టెంట్. నేను అయితే న్యూస్ కోసం ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు హిందూ న్యూస్ పేపర్లని ఫాలో అయ్యేదానిని. రీజనల్ న్యూస్ కోసం ఈటీవీ మరియు ఈనాడు ను ఫాలో అయ్యే దానిని.
నా ఇన్స్పిరేషన్ రాని రుద్రమదేవి. రుద్రమదేవి ఒక ఫిమేల్ రూలర్ లాగా ఉండి ఒక బలమైన సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసింది మరియు దానిని ప్రొటెక్ట్ చేసింది. ఆ భూమిలో పుట్టినందుకు రాణి రుద్రమదేవి నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్.
నాకు వచ్చే రోల్ లో నేను 100% ఇస్తాను. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఒక కామన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సొసైటీలో డిఫరెన్స్ నాకు చాలా బాగా తెలుసు. సివిల్ సర్వెంట్స్ పబ్లిక్ కి దగ్గరగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుని వారికి అవైలబుల్ లో ఉండాలి.
ఇప్పుడు సివిల్ సర్వీసెస్ చదువుతున్నవారు మనకు ఇది ఎందుకు కావాలి అని చాలా క్లారిటీ ఉండాలి.ఇది మనకు కావాలి అని క్లారిటీగా అనుకున్న తర్వాత, దానికోసం ఎంతైనా కష్టపడాలి, ఎంత దూరమైన వెళ్లాలి. 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. హార్డ్ వర్క్ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. అని ఆవిడ తెలియజేశారు.
0 కామెంట్లు