RRI Recruitment in Telugu Apply in www.rri.res.in: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
RAMAN RESEARCH INSTITUTE(www.rri.res.in), Bengaluru నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ The Raman Research Institute అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rri.res.in లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఈ RAMAN RESEARCH INSTITUTE (RRI) రిక్రూట్మెంట్ ద్వారా (ఎలక్ట్రానిక్స్) ఇంజనీర్ - A - 3 పోస్టులను, (ఫోటోనిక్స్) ఇంజనీర్ - A - 2 పోస్టులను, (సివిల్) ఇంజనీరింగ్ అసిస్టెంట్ - C - 1 (అన్ రిజర్వుడ్) పోస్టును, అసిస్టెంట్ - 4 (అన్ రిజర్వుడ్డ్-3, ఈడబ్ల్యూఎస్ - 1) పోస్టులను, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ - 1 (అన్ రిజర్వుడ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ RRI నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ RAMAN RESEARCH INSTITUTE (RRI) నోటిఫికేషన్ కొరకు ఏప్రిల్ 07, 2025 వ తేదీ నుండి మే 14, 2025 వ తేదీ రాత్రి 11:59 లోపు www.rri.res.in వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిపోతే ఈ రిక్రూట్మెంట్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
Engineer A (Electronics):
ఇంజనీరింగ్ డిగ్రీ(బ్యాచులర్స్ డిగ్రీ) లో ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పోస్టులు కి అప్లై చేసుకోవలి.
లేదా
MSc డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Engineer A (Photonics):
ఇంజనీరింగ్ డిగ్రీ(బ్యాచులర్స్ డిగ్రీ) లో ఫోటోనిక్స్ లేదా ఈక్వలెంట్ సబ్జెక్టు లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పోస్టులు కి అప్లై చేసుకోవలి.
లేదా
MSc లో ఫోటోనిక్స్ లేదా ఈక్వలెంట్ సబ్జెక్టు లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు.
Engineering Assistant C (Civil):
సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
Assistant:
ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా డిసిప్లెయిన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. (వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చదువుకోండి)
Assistant Canteen Manager:
హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు./ హోటల్ ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. పూర్తి వివరాలు ఆఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఈ క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా.. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉంటే కచ్చితంగా షేర్ చేయండి. అసలు మర్చిపోవద్దు.
Age Limit:
Engineer A (Electronics):
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి మే 14, 2025 వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయసుగల వారు ఈ (ఎలక్ట్రానిక్స్) ఇంజనీర్ ఏ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
Engineer A (Photonics):
14-05-2025 వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు.
Engineering Assistant C (Civil):
28 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు ఈ (సివిల్) ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 28 సంవత్సరాలు లోపు అనేది మే 14, 2025 వ తేదీ నాటికి అభ్యర్థులు కలిగి ఉండాలి.
Assistant:
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి 14-05-2025 వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ అసిస్టెంట్ పోస్టుకి అర్హులు.
Assistant Canteen Manager:
ఈ అసిస్టెంట్ కాంటీన్ మేనేజర్ పోస్టు కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులకి మీ 14, 2025వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Selection Process:
ఈ (ఎలక్ట్రానిక్స్) ఇంజనీర్ - A మరియు (ఫోటోనిక్స్) ఇంజనీర్ - A ఉద్యోగాలు లెవెల్ - 10 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత సబ్జెక్టీవ్ టెస్టు ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది.
ఈ (సివిల్) ఇంజనీరింగ్ అసిస్టెంట్ - C ఉద్యోగం లెవెల్ - 05 ఉద్యోగం. అసిస్టెంట్ ఉద్యోగం లెవెల్ 4 ఉద్యోగం. అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ ఉద్యోగం లెవెల్ 6 ఉద్యోగం. ఈ మూడు పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత సబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Application Fee:
అన్ రిజర్వుడు, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి.
మహిళలు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
మీరు ఏ పోస్ట్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్టుకు అప్లై చేసుకోండి. మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ప్రతి అప్లికేషన్ కు కూడా ఫీజు చెల్లించాలి.
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ముందుగా 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ చేయడం జరుగుతుంది.
అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఆధారంగా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా వ్యాలీడ్డ్ మెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. ఎందుకు అంటే అడ్మిట్ కార్డు కి సంబంధించి అప్డేట్ అనేది మీ మెయిల్ కు రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ను కచ్చితంగా ప్రింట్ ఔట్ తీసుకోండి.
అఫీషియల్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది.
Official Website: www.rri.res.in
0 కామెంట్లు