AP Vahana Mitra Scheme 2025: ఆటో డ్రైవర్లకు ఏపీ వాహన మిత్ర పథకం 2025 కింద 15,000 రూపాయలు
AP Vahana Mitra Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో AP Vahana Mitra Scheme (ఏపీ వాహన మిత్ర పథకం) 2025 కింద అర్హులైన ఆటోడ్రైవర్లకి 15000 రూపాయలను దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ AP Vahana Mitra Scheme (ఏపీ వాహన మిత్ర పథకం) 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection అన్ని వివరాలు చూద్దాం.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లకు 15000 రూపాయలను ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
ఆగస్టు 15, 2025 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి(ఉచిత బస్సు ప్రయాణం) పథకం ను ప్రారంభించింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం వలన రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా నష్టం కలుగుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా అర్హులైన ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయనుంది.
ఈ AP Vahana Mitra Scheme 2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 2.90 లక్షల ఆటోడ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. ఈ వాహన మిత్ర పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 435 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనుంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలను అందించేది. గతంలో వైసిపి ప్రభుత్వంలో దాదాపు 2.75 లక్షల ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేది.
అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి 15,000 రూపాయలను అందించనుంది. ఈసారి దాదాపు 2.90 లక్షల డ్రైవర్లకు లబ్ది చేకూరనుంది.
ఆటో డ్రైవర్లతోపాటు.. టాక్సీ డ్రైవర్లు మరియు మ్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు అకౌంట్ లో జమా కానుంది.
త్వరలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎలా అప్లై చేసుకోవాలి మరియు మిగతా వివరాలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది.
0 కామెంట్‌లు