ఏపీలోని బ్యాంకుల్లో ఉద్యోగాలు: APCOB Recruitment 2026

 APCOB Recruitment 2026

APCOB Recruitment 2026


  ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లు జూలై 24, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ APCOB Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ APCOB Recruitment 2026 ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. విజయనగరం, ప్రకాశం, కడప, విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుండి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని నోటిఫికేషన్ల ద్వారా టోటల్ గా 338 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ APCOB Recruitment 2026 కోసం అభ్యర్థులు జూలై 24, 2026వ తేదీ నుండి ఆగస్టు 7, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

  జూన్ 1, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.


Educational Qualification:

  స్టాఫ్ అసిస్టెంట్: ఏదైనా డిస్ప్లేన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
 
 లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 
 ఇంగ్లీష్ పై నాలెడ్జ్ ఉండాలి. 
 కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 

  అసిస్టెంట్ మేనేజర్: ఏదైనా డిసిప్లేన్లో ఫస్ట్ క్లాస్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి/High second class in commerce (aggregate of 55% and above)/ ఏదైనా డిసిప్లేన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

 లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 
 ఇంగ్లీష్ పై నాలెడ్జ్ ఉండాలి. 
 కంప్యూటర్స్ పై వర్కింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

Note: జిల్లాల వారీగా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్ లకి అప్లై చేసుకోవాలి.

Selection Process:

  ఆన్లైన్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ నోటిఫికేషన్లు భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:

ఈ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు జూలై 24, 2026వ తేదీ నుండి ఆగస్టు 7, 2026వ తేదీ మధ్య అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://apcob.bank.in/careers/లో అప్లై చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Application Fee:


  ఈ నోటిఫికేషన్ లోకి అప్లై చేయాలి అంటే 826 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 590 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

మిగిలిన అన్ని వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు