Railway Vishakapatnam Recruitment 2026
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పని చేస్తున్నటువంటి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను విశాఖపట్నంలో భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Railway Vishakapatnam Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ Railway Vishakapatnam Recruitment 2026 ద్వారా
ప్రాజెక్ట్ ఇంజనీర్/M&P - 1 పోస్టు
ప్రాజెక్ట్ ఇంజనీర్/Ele. Maintenance - 1 పోస్టు
టెక్నీషియన్/ మెకానికల్ - 5 పోస్టులు
టెక్నీషియన్/ఎలక్ట్రికల్ - 16 పోస్టులు
యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్ - 1 పోస్టు
షంటింగ్ ఆపరేటర్ - 12 పోస్టులు
మొత్తంగా 36 పోస్టులను భర్తీ చేస్తూ ఉlన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోవలసి అవసరం లేదు. వారు తెలిపిన తేదీలో అప్లికేషన్ అక్కడికి తీసుకొని వెళితే సరిపోతుంది.
Age Limit:
ప్రాజెక్ట్ ఇంజనీర్/M&P/ప్రాజెక్ట్ ఇంజనీర్/Ele. Maintenance/యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్: 55 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్( మెకానికల్)/టెక్నీషియన్ఎ(లక్ట్రికల్)/షంటింగ్ ఆపరేటర్: 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరంలకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Selection Process:
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపాలి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అట్టాక్ చేయాలి. తర్వాత వారు తెలిపిన అడ్రస్ కు తెలిపిన తేదీలో అటెండ్ కావాలి.
ప్రాజెక్ట్ ఇంజనీర్/M&P, ప్రాజెక్ట్ ఇంజనీర్/Ele. Maintenance, యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్, షంటింగ్ ఆపరేటర్ - ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు వారు తెలిపిన అడ్రస్ కి జూన్ 22, 2026 వ తేదీన హాజరు కావాలి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళాలి.
టెక్నీషియన్/ మెకానికల్, టెక్నీషియన్/ఎలక్ట్రికల్ - ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు జూన్ 23, 2026 వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళాలి.
Educational Qualification:
ప్రాజెక్ట్ ఇంజనీర్/M&P: మెకానికల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/మ్యానుఫ్యాక్చరింగ్/మెకాట్రానిక్/మెటీరియల్ సైన్సెస్/మెటలాజికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా/ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలి.
ప్రాజెక్ట్ ఇంజనీర్/Ele. Maintenance: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా closely related sub-streams లో డిప్లమా/డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
టెక్నీషియన్/ మెకానికల్: మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా రిలేటెడ్ ట్రేడ్స్ లో ఐటిఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉండాలి.
టెక్నీషియన్/ఎలక్ట్రికల్: ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్: ఏదైనా డిసిప్లేన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
షంటింగ్ ఆపరేటర్: మినిమం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
Salary:
ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే జీతం 50,060 రూపాయల నుండి 57,140 రూపాయల మధ్య ఉంటుంది.
టెక్నీషియన్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే జీతం 27,100 రూపాయల నుండి 30,900 రూపాయల మధ్య ఉంటుంది.
సెంటింగ్ ఆపరేటర్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే జీతం 25,700 రూపాయల నుండి 29,300 రూపాయల మధ్య ఉంటుంది.
ఈ పోస్టులను కాంట్రాక్టు బేస్డ్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మిగిలిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

0 కామెంట్‌లు