AP Medical Notification 2026
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టువల్ మరియు ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వివిడుదలయింది. ఈ నోటిఫికేషన్ జూన్ 18, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ AP Medical Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II - 1 పోస్టు
డార్క్ రూమ్ అసిస్టెంట్ - 3 పోస్టులు
జనరల్ డ్యూటీ అటెండర్ - 7 పోస్టులు
పోస్టు మార్టం అసిస్టెంట్ - 1 పోస్టు
మొత్తంగా 12 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 18, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 30, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ నుండి విడుదల కావడం జరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 మేనేజర్ స్థాయి ఉద్యోగాలు.
Age Limit:
జనవరి 01, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
జనరల్ డ్యూటీ అటెండర్: పదవ తరగతి లేదా ఈక్వలేంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
పోస్టు మార్టం అసిస్టెంట్: పదవ తరగతి లేదా ఈక్వలేంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్‌లు నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 18, 2026వ తేదీ నుండి జూన్ 30, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.kakinada.ap.gov.in లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారం ను పూర్తిగా నింపి, అడిగిన డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. అన్నింటిని జూన్ 30, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నోటిఫికేషన్లో తెలిపిన అడ్రస్‌కు వెళ్లి అందజేయాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 350 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ఫీజును డిమాండు డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
0 కామెంట్లు