పదవ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! Konkan Railway Recruitment 2026

   Konkan Railway Recruitment 2026


Konkan Railway Recruitment 2026



  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లో చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరగదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Konkan Railway Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. 

  ఈ Konkan Railway Recruitment 2026 ద్వారా 

 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్/మెకానికల్ - 11 పోస్టులు 

 క్వాలిటీ ఇన్స్పెక్టర్ - 15 పోస్టులు 

 టెక్నీషియన్ (వెల్డర్) - 16 పోస్టులు 

 టెక్నీషియన్ (ఫీట్టర్) - 22 పోస్టులు 

 టెక్నీషియన్ (EOT Operator) - 16 పోస్టులు 

 వెహికల్ డ్రైవర్ - 4 పోస్టులు 

 లిస్టర్/ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్ - 14 పోస్టులు 

 హైడ్రా ఆపరేటర్ - 2 పోస్టులు 

 ఆఫీస్ బాయ్/హెల్పర్/కాళసి - 32 పోస్టులు 

మొత్తంగా 132 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 పోస్టులు


Age Limit:

 మే 01, 2026వ తేదీ నాటికి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
 ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

  జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్/మెకానికల్: మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/మ్యానుఫ్యాక్చరింగ్/వెంకట్రామిక్/మెటీరియల్ సైన్సెస్/మెటలాజికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైం డిగ్రీ/డిప్లమా చేసిన వారు  అర్హులు. అలాగే ఒక సంవత్సరం పోస్టు ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది.

  క్వాలిటీ ఇన్స్పెక్టర్: మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/మ్యానుఫ్యాక్చరింగ్/ మేకట్రాణిక్/మెటీరియల్ సైన్సెస్/మెటలాజికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైం డిగ్రీ చేసినవారు ఈ పోస్టులకి  అర్హులు. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.

  టెక్నీషియన్ (వెల్డర్): వెల్డింగ్ లో ఐటిఐ చేసిన వారు ఈ పోస్టులకి అర్హులు. అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉండాలి.
  టెక్నీషియన్ (ఫీట్టర్): ఐటిఐ చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 

  టెక్నీషియన్ (EOT Operator): పదవ తరగతి లేదా ఐటిఐ పాస్ అయిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే పదవ తరగతి పాసైన వారు నాలుగు సంవత్సరంల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. ఐటిఐ అర్హత కలిగిన వారు రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 

  వెహికల్ డ్రైవర్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. వ్యాలీడ్ HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

  లిస్టర్/ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్:  ఐటిఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 

  హైడ్రా ఆపరేటర్: ఐటిఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 

  ఆఫీస్ బాయ్/హెల్పర్/కాళసి: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు:

 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్/మెకానికల్ - 8/06/2026 

 క్వాలిటీ ఇన్స్పెక్టర్ - 8/06/2026 

 టెక్నీషియన్ (వెల్డర్) -  9/06/2026

 టెక్నీషియన్ (EOT Operator) - 9/06/2026 

 టెక్నీషియన్ (ఫీట్టర్)  - 10/06/2026

 వెహికల్ డ్రైవర్ - 10/06/2026 

 లిస్టర్/ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్ - 11/06/2026

 హైడ్రా ఆపరేటర్ - 11/06/2026

 ఆఫీస్ బాయ్/హెల్పర్/కాళసి - 12/06/2026

అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. అభ్యర్థులు ఇంటర్వ్యూ కి వెళ్లే రోజు అఫీషియల్ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లికేషన్ ఫారం ను నింపి, వాటితో పాటు వారు అడిగిన డాక్యుమెంట్స్ ని తీసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కు ఇంటర్వ్యూ తేదీన వెళ్లాల్సి ఉంటుంది. 

Note: పూర్తి వివరాలను కచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ లో చదువుకోండి.

  ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పీరియడ్లో భర్తీ చేస్తూ ఉన్నారు. తర్వాత పర్ఫామెన్స్ ను బేస్ చేసుకుని ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.



Official Website: https://konkanrailway.com/


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు