IOB Apprentices Recruitment 2025: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IOB Apprentices Recruitment 2025 ద్వారా 750 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ IOB Apprentices Recruitment 2025 నోటిఫికేషన్ 750 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లో 15 ఉద్యోగాలను మరియు తెలంగాణ లో 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ IOB Apprentices Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 10, 2025 వ తేదీ నుండి ఆగస్టు 20, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 20, 2025.
Age Limit:
ఆగస్టు 1, 2025 వ తేదీ నాటికి 20 నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు 1997 ఆగస్టు 01 వ తేదీ నుండి 2005 ఆగస్టు 01 మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హండికాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు డిగ్రీ నీ ఏప్రిల్ 01, 2021 వ తేదీ నుండి ఆగస్టు 01, 2025 వ తేదీ మధ్య పాస్ అయి ఉండాలి.
Selection Process:
ఆన్లైన్ ఎగ్జామ్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఆన్లైన్ ఎగ్జామ్:
జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
జనరల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
కంప్యూటర్ ఆర్ సబ్జెక్టు నాలెడ్జ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
మొత్తం గా 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
ఎగ్జామ్ ను ఆగస్టు 24, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 944 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిమేల్ అభ్యర్థులు 708 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఫిజికల్ హండికాప్ అభ్యర్థులు 472 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 20, 2025.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ముందుగా www.iob.in వెబ్సైట్ లో కెరీర్స్ పేజ్ లో అఫిషియల్ నోటిఫికేషన్ చూసుకోండి.
తర్వాత https://nats.education.gov.in లేదా https://www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని www.bfsissc.com వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
Note: ఈ IOB Apprentices Recruitment 2025 ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు.
Official Website: https://www.iob.in/Careers
0 కామెంట్లు