CDFD Recruitment 2025 In Telugu: పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD), హైదరాబాదు నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ CDFD Recruitment 2025 అనేది ఆగస్టు 23, 2025 వ తేదీన విడుదల అయింది.
ఈ CDFD Recruitment 2025 ద్వారా టెక్నికల్ ఆఫీసర్ -I: 1 పోస్టును (EWS), టెక్నికల్ అసిస్టెంట్: 2 పోస్టులను (UR -1, EWS -1), జూనియర్ మేనేజిరీల్ అసిస్టెంట్: 2 పోస్టులను (UR -1, SC -1), జూనియర్ అసిస్టెంట్-II: 2 పోస్టులను (UR -1, ST -1), స్కెల్ద్ వర్క్ అసిస్టెంట్ - II: 2 పోస్టులను (UR -1, ST -1) భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే హైదరాబాదులో పోస్టింగ్ ఉంటుంది.
ఈ CDFD Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 25, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 30, 2025వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను ప్రింట్ అవుట్ తీసుకొని, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, వారు అడిగిన విధంగా సైన్ చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు అక్టోబర్ 10, 2025 వ తేదీ లోపు చేరుకునేలా పంపాలి.
Age Limit:
టెక్నికల్ ఆఫీసర్ -I: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 30 సంవత్సరముల లోపు వయసును కలిగి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 30 సంవత్సరముల లోపు వయసును కలిగి ఉండాలి.
జూనియర్ మేనేజిరీల్ అసిస్టెంట్: 25 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ అసిస్టెంట్-II: 25 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
స్కెల్ద్ వర్క్ అసిస్టెంట్ - II: 25 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
టెక్నికల్ ఆఫీసర్ -I: బిఎస్సీలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. అలాగే 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
లేదా
MSC లేదా ఈక్వేలెంట్ చేసి ఉండాలి. అలాగే 2సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: బిఎస్సి/బీటెక్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. అలాగే 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
లేదా
సైన్సు/టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
లేదా
సైన్సు/టెక్నాలజీలో పిజి డిప్లమా చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
జూనియర్ మేనేజిరీల్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మూడు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
జూనియర్ అసిస్టెంట్-II: ఇంటర్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ను కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
స్కిల్డ్ వర్క్ అసిస్టంట్- II: పదవ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటే నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Official Website: https://cdfd.org.in/
0 కామెంట్లు