SSC JE(Junior Engineer) Recruitment 2025 In Telugu: ఎస్ఎస్సి ఉద్యోగాలు

 SSC JE(Junior Engineer) Recruitment 2025 In Telugu: ఎస్ఎస్సి ఉద్యోగాలు





  SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి JE(జూనియర్ ఇంజనీర్) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ SSC JE Recruitment 2025 ద్వారా 1340 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  ఈ SSC JE Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 30, 2025 వ తేదీ నుండి జూలై 21, 2025 వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజును జులై 22, 2025వ తేదీలోపు చెల్లించాలి. అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే ఆగస్టు 01, 2025 నుండి ఆగస్టు 02, 2025 లోపు కరెక్ట్ చేసుకోవాలి.

Age Limit:


  18 సంవత్సరముల నుండి 30, 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  ఏదైనా యూనివర్సిటీ నుండి సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:


  పేపర్ 1 మరియు పేపర్ 2 ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్ లు కంప్యూటర్ బేస్ నిర్వహించడం జరుగుతుంది. పేపర్ వన్ ఎగ్జామ్ అక్టోబర్ 27, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 31, 2025వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 2 ఎగ్జామ్ ను జనవరి-ఫిబ్రవరి, 2026 లో నిర్వహించడం జరుగుతుంది.

Examination Centers: 


  ఆంధ్రప్రదేశ్ లో: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు.

  తెలంగాణ లో: హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఒంగోలు.

Application Fee: 


  అభ్యర్థులు ఈ SSC JE Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే వంద రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Official Website: https://ssc.nic.in

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు