TGSRTC Outsourcing Conductor Recruitment 2025 in Telugu: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.
TGSRTC (తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ) నుండి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ TGSRTC Outsourcing Conductor Recruitment 2025 ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తూ ఉన్నారు.
రెండు నెలల క్రితం తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ద్వారా 1000 డ్రైవర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేశారు. ఇదే పద్ధతి ద్వారా కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ TGSRTC Outsourcing Conductor Recruitment 2025 కి సంబంధించి త్వరలో అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. TGSRTC Outsourcing Conductor Recruitment 2025 ద్వారా హైదరాబాదు, సికింద్రాబాద్ మరియు వరంగల్ రీజియన్ పరిధిలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 800 కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
గడిచిన కొన్ని నెలల్లోనే TGSRTC లో 1500 మంది పదవీ విరమణ తీసుకున్నారు. కావున TGSRTC లో కండక్టర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం పని చేస్తున్న కండక్టర్లు అదనపు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అదనపు డ్యూటీకి డబ్బులు చెల్లిస్తున్న ఎక్కువ సమయం పని చేస్తున్నాడంతో కండక్టర్లు తీవ్రంగా అలసిపోతున్నారు.
ప్రభుత్వం ఇది వరకే డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు మరియు ఇతర పోస్టులు కలుపుకొని 4000 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని కారణాలవల్ల పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూ వస్తోంది. ఆర్టీసీలో చాలా కొరత ఏర్పడడంతో నోటిఫికేషన్ భర్తీ అయ్యేవరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలి అని TGSRTC నిర్ణయించుకుంది.
అదేవిధంగా రెండు నెలల క్రితం 1000 డ్రైవర్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసింది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని వారు ఇప్పుడు విధుల్లో కొనసాగుతున్నారు. ఇదే పద్ధతిలో ఇప్పుడు 800 కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయమన్నారు. హైదరాబాద్ రీజియన్ లో 600 కండక్టర్ పోస్టులను, వరంగల్ రీజియన్లు 200 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే నెలకు 17,969 రూపాయల శాలరీ రావడం జరుగుతుంది. అలాగే అదనంగా పనిచేస్తే గంటకు 100 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. గంట దాటితే 200 ఇవ్వడం జరుగుతుంది.
0 కామెంట్లు