Ad Code

Responsive Advertisement

NICL Notification 2025 in Telugu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలు.

NICL Notification 2025 in Telugu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలు.


NICL Notification 2025 in Telugu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలు.



  NICL (National Insurance Company Limited) నుండి Officer స్థాయి ఉద్యోగాలను భర్తి చేస్తున్నారు. ఈ NICL Notification 2025 ద్వారా 266 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఆఫీసర్ స్థాయి స్కేల్ వన్ ఉద్యోగాలు. 

  ఈ NICL Notification 2025 ద్వారా డాక్టర్స్ (MBBS) - 10 పోస్టులను, లీగల్ - 20 పోస్టులను, ఫైనాన్స్ - 20 పోస్టులను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 20 పోస్టులను, ఆటోమొబైల్ ఇంజనీర్స్ - 20 పోస్టులను మొత్తంగా 96 పోస్టులను, జనరలిస్ట్ 170 పోస్టులను అన్ని కలుపుకొని 266 ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు.

  ఈ NICL Notification 2025 కోసం అభ్యర్థులు జూన్ 12, 2025వ తేదీ నుండి జులై 03, 2025 వ తేదీలోపు ఆన్లైన్లో https://nationalinsurance.nic.co.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.

Age Limit: 


  
  మే 01, 2025 వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్షీయేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సిలేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ అభ్యర్థులకు 10 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  డాక్టర్స్ (MBBS): MBBS/M.D./M.S. or PG - మెడికల్ డిగ్రీ నీ ఏదైనా రికగ్నైసేడ్ యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి.
లేదా
అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

  లీగల్: “లా” లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులతో (ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది) పాస్ అయి ఉండాలి. 

  ఫైనాన్స్: చార్టెడ్ అకౌంటెంట్ (ICAI), కోస్టు అకౌంటెంట్(ICWA)
లేదా 
B.COM/M.COM ను 60% మార్కులతో పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాసైతే సరిపోతుంది.

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్ లో బిఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంసీఏ లో 60% మార్కులతో పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాసైతే సరిపోతుంది.

  ఆటోమొబైల్ ఇంజనీరింగ్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బిఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేదా 
బిఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ లో ఎనీ బ్రాంచ్ చేసి, మినిమం ఒక సంవత్సరం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి.


జనరలిస్ట్ ఆఫీసర్స్: ఎనీ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులతో పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది.

Selection Process: 


  ఈ NICL Notification 2025 ను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ జులై 20, 2025వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్టు 31, 2025న నిర్వహించడం జరుగుతుంది.

Examination Centers:


Andhra Pradesh: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు. 

Telangana: హైదరాబాదు/రంగారెడ్డి, వరంగల్.

Application Fee: 


  అభ్యర్థు లు ఈ NICL Notification 2025 కి అప్లై చేయాలి అంటే 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ/ఎస్టి/ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 250 చెల్లిస్తే సరిపోతుంది.

Bond: నాలుగు సంవత్సరాలు పనిచేస్తానని బాండు రాయాలి.

Salary: అన్నీ కలుపుకొని నెలకు 90,000 రూపాయలు రావడం జరుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు