Ad Code

Responsive Advertisement

SBI CBO Recruitment 2025 ద్వారా 2964 ఉద్యోగాల భర్తీ

SBI CBO Recruitment 2025 ద్వారా 2964 ఉద్యోగాల భర్తీ


SBI CBO Recruitment 2025 ద్వారా 2964 ఉద్యోగాల భర్తీ



SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుండి Circle Based Officers ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ SBI CBO Recruitment 2025 ద్వారా 2964 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


ఈ 2964 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లో 180 పోస్టులను, తెలంగాణలో 230 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 


ఏపి లో జనరల్ - 74 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ - 18 పోస్టులు, ఓబిసి - 48 పోస్టులు, ఎస్టీ - 13 పోస్టులు, ఎస్సీ - 27 పోస్టులు మొత్తంగా 180 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు కూడా భర్తీ చేస్తున్నారు.


తెలంగాణలో జనరల్ - 94 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ - 23 పోస్టులు, ఓబిసి - 62 పోస్టులు, ఎస్టీ - 17 పోస్టులు, ఎస్సీ - 34 పోస్టులు మొత్తంగా 230 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు కూడా పోస్టులను కేటాయించడం జరిగింది.


  ఈ SBI CBO Recruitment 2025 ఉద్యోగాల కోసం మే 09, 2025 వ తేదీ నుండి మే 29, 2025 వ తేదీలోపు  https://bank.sbi/web/careers//current-openings  వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.


  ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఐడిబిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలు. 


Educational Qualification: 


  ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.

Age Limit: 


   21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 
ఓబీసి కి మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

Selection Process: 


  ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ SBI CBO Recruitment 2025 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Online Test: 


ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది 120 మార్కులకి ఆబ్జెక్టివ్ టెస్టులో మరియు 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్టు రూపంలో ఉంటుంది.

Objective Test: ఈ అబ్జెక్టివ్ టెస్ట్ అనేది 120 మార్కులకు గాను 120 ప్రశ్నలు చొప్పున 2 గంటల పాటు ఉంటుంది.

ఇంగ్లీషు లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు-30 నిమిషాలు 

బ్యాంకింగ్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు-40 నిమిషాలు 

జనరల్ అవేర్నెస్/ఎకానమీ-30 ప్రశ్నలు-30 మార్కులు-30 నిమిషాలు 

కంప్యూటర్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు-20 నిమిషాలు 

మొత్తంగా 120 ప్రశ్నలు-120 మార్కులు-120 నిమిషాలు పాటు ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది.
నెగిటివ్ మార్కింగ్ లేదు. అలాగే సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు.

Descriptive Test: ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. లెటర్ రైటింగ్ మరియు ఎస్ఎ కి సంబంధించి రెండు ప్రశ్నలకు గాను 50 మార్కులు చొప్పున 30 నిమిషాల పాటు ఉంటుంది.

ఇంటర్వ్యూ: 


  ఇంటర్వ్యూ ను 50 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. 

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్:  లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సి టెస్ట్ను చివరిగా నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఏ స్టేట్ కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 

  మీరు ఏ స్టేట్ కి అప్లై చేసుకుంటే మీ జాబ్ అనేది ఆ స్టేట్లోనే రావడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక స్టేట్ కు మాత్రమే అప్లై చేసుకోవాలి. 

Application Fee: 


  ఈ SBI CBO Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలు ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకోవాలి.

  ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

  ఫీజు చెల్లించడానికి మే 29, 2025.

Examination Centers: 


Andhra Pradesh: అనంతపూర్, గుంటూరు/విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

Telangana: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు