AP new spouse pension 2025 in telugu: వితంతు పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి.
AP new spouse pension 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. కొత్త పెన్షన్లకి అప్లై చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. కొత్త పెన్షన్లు అంటే అందరికీ కాదు కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కొత్తగా ఎవరు అప్లై చేసుకోవచ్చు?, ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం?, ఎలా అప్లై చేసుకోవాలి?, ఎప్పటినుండి పెన్షన్ వస్తుంది?. అనే మొత్తం విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులకు కొత్త పెన్షన్లను జారీ చేయనున్నది. 89,788 కొత్త పెన్షన్లను ఇవ్వడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ 89,788 మందికి సంబంధించి జాబితా కూడా వచ్చింది. దాని లో మీ పేరును ఒకసారి చూసుకోండి.
2024 నవంబర్, 01 నుండి భర్త పెన్షన్ పొందుతూ ఉండి.. అతను చనిపోతే సంబధిత డాక్యుమెంట్ నీ సచివాలయం కి చేర్చితే మరుసటి నెలలోనే సంబంధిత వితంతువుకి పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది.
అయితే ఇప్పుడు ఎవరికీ పెన్షన్ అందించనున్నారు అంటే.. 2023 డిసెంబర్ 01 వ తేదీ నుండి 2024 అక్టోబర్ 31 వ తేదీ మధ్యలో ఎవరైతే భర్తలు చనిపోయారో వారికి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
కావలసిన డాక్యుమెంట్లు:
* భర్త డెత్ సర్టిఫికెట్ కావాలి
* భర్త యొక్క ఆధార్ కార్డు కావాలి
* భార్య యొక్క ఆధార్ కార్డు కావాలి
* రేషన్/బియ్యం కార్డు కావాలి
* ఈ పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫారం కావాలి.
AP new spouse pension 2025 ఎక్కడ అప్లై చేసుకోవాలి?
మీ గ్రామానికి సంబంధించిన సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ అనే ఉద్యోగి ఉంటారు. పైన తెలిపిన మీ భర్త డెత్ సర్టిఫికెట్, మీ భర్త ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు అప్లికేషన్ ఫారం తీసుకొని మీ సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ నీ కలవండి. అయితే ఈ AP new spouse pension 2025 పెన్షన్ కోసం ఏప్రిల్ 30, 2025 వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి త్వరపడండి.
రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన 89,788 మంది జాబితాలో ఉన్న వితంతువులకు మే 01, 2025 నుండి పెన్షన్ను మంజూరు చేయనున్నారు. కాబట్టి వారు ఇచ్చిన జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ పేరు ఉంటే కచ్చితంగా ఏప్రిల్ 30 లోపు అప్లై చేసుకోండి.
కొందరి పేరు ఈ 89,788 జాబితాలో లేదు అని అంటున్నారు. పేరు లేకపోవడానికి వారు తెలిపిన కారణం 6 step వెరిఫికేషన్. గతంలో ఈ 6 step వెరిఫికేషన్ జరిగింది. మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా, నాలుగు చక్రాల వాహనం ఉందా, టాక్స్ పేర్లు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో, పొలం ఏమైనా ఎక్కువ ఉంద, మీరు పట్టణం వాసులు అయితే మీ ఇల్లు ఎక్కువ స్థలంలో ఉందా, అని వెరిఫికేషన్ చేశారు. ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా, నాలుగు చక్రాల వాహనం ఉందా, టాక్స్ పేర్లు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో, పొలం ఏమైనా ఎక్కువ ఉంద, మీరు పట్టణం వాసులు అయితే మీ ఇల్లు ఎక్కువ స్థలంలో ఉందా వీటిలో మీ కుటుంబం అనగా ఉంటే మీకు ఈ పెన్షన్ వర్తించదు. సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోగలరు.
మిగతావారు వికలాంగులు లేదా ఇతర వృద్ధాప్య పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినది కేవలం 2023 డిసెంబర్ 01 వ తేదీ నుండి 2024 అక్టోబర్ 31 వ తేదీ మధ్యలో ఎవరైతే భర్తలు చనిపోయారో వితంతువులకు ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏప్రిల్ 30వ తేదీ లోపల కచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వారికి కచ్చితంగా షేర్ చేయండి.
ఎప్పటినుండి పెన్షన్ వస్తుంది?
వితంతువులు ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వారిని పరిశీలించి మే 01, 2025 నుండి పెన్షన్లను మంజూరు చేయనుంది. మే 01 తేదీన సచివాలయం ఉద్యోగులు ఈ పెన్షన్ ను అందజేస్తారు.
0 కామెంట్‌లు